Saturday, June 13, 2026
Homeసినిమాహ‌రిహ‌ర వీర‌మ‌ల్లు‘ ప్రచార చిత్రం విడుదల

హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు‘ ప్రచార చిత్రం విడుదల

పవన్ కళ్యాణ్ హీరోగా,   క్రిష్ జాగ‌ర్ల‌మూడి రూపొందిస్తోన్న ‘హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు‘.‘నిధి అగర్వాల్‘ నాయిక. మెగా సూర్యా ప్రొడ‌క్షన్ బ్యాన‌ర్ పై లెజండ‌రీ ప్రొడ్యూస‌ర్ ఎ.ఎం. ర‌త్నం సమర్పణలో నిర్మాత దయాకర్ రావు ఈ ఎపిక్‌ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చిత్ర కథానాయకుడు పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు (సెప్టెంబర్ 2) సందర్భంగా ప్రచార చిత్రంను విడుదల చేశారు చిత్ర బృందం.

ఈ ప్రచార చిత్రంలో…
స్వాగతిస్తుంది సమరపథం..
దూసుకొస్తుంది వీరమల్లు విజయరథం…
అన్నట్లుగా కనిపిస్తారు కథానాయకుడు.  అంతేకాదు  సెప్టెంబర్ 2, సాయంత్రం గం: 5.45 నిమిషాలకు పవర్ గ్లాన్స్ పేరుతో ఓ పవర్ ఫుల్ వీడియో ను విడుదల చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించటంతో అభిమానుల ఆనంద సంబరాలు ఉవ్వెత్తున ఎగసి పడుతున్నాయి. వారి ఆనందాన్ని మరింత ఉచ్ఛ స్థితికి వెళ్లేలా ఆ వీడియో ఉండబోతోందన్నది నిజం.

17వ శ‌తాబ్దం నాటి మొఘ‌లాయిలు, కుతుబ్ షాహీల శ‌కం నేప‌థ్యంలో జ‌రిగే క‌థ‌తో, అత్య‌ద్భుత‌మైన విజువ‌ల్ ఫీస్ట్‌గా ఈ”హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు” సినిమా రూపొందుతోంది. ఇది ఒక లెజండ‌రీ బందిపోటు వీరోచిత గాథ.” ఇది భార‌తీయ సినిమాలో ఇప్ప‌టిదాకా చెప్ప‌ని క‌థ‌. ఖచ్చితంగా ఈ చిత్రం ప్రేక్ష‌కుల‌కు ఒక మ‌ర‌పురాని అనుభ‌వాన్ని ఇస్తుంది.  పాన్‌-ఇండియా స్థాయిలో నిర్మాణ‌మ‌వుతోన్న ఈ సినిమాని తెలుగుతో పాటు హిందీ, త‌మిళ‌, కన్నడ, మ‌ల‌యాళం భాష‌ల్లో ఏక కాలంలో విడుద‌ల చేయ‌నున్నారు. ఇప్పటివరకు ‘హరిహర వీరమల్లు’ షూటింగ్‌ యాభై శాతం పూర్త‌యింది. త్వరలో చిత్రం నూతన షెడ్యూల్ ప్రారంభం అవుతుందని నిర్మాత‌ ఎ.ద‌యాక‌ర్ రావు తెలియచేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular