Friday, June 12, 2026
Homeసినిమావీర‌మ‌ల్లు విష‌యంలో ప‌వ‌న్ ఆలోచ‌న మారిందా..?

వీర‌మ‌ల్లు విష‌యంలో ప‌వ‌న్ ఆలోచ‌న మారిందా..?

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్  వీర‌మ‌ల్లు సినిమాను ఎప్పుడో ప్రారంభించారు. క్రిష్ డైరెక్ష‌న్ లో పాన్ ఇండియా మూవీగా రూపొందుతోన్న ఈ సినిమా పై ప‌వ‌ర్ స్టార్ అభిమానులు చాలా ఆశ‌లు పెట్టుకున్నారు. సీనియ‌ర్ ప్రొడ్యూస‌ర్ ఏఎం ర‌త్నం ఈ చిత్రాన్ని అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తున్నారు. హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు ప‌వ‌న్ ఫ‌స్ట్ పాన్ ఇండియా మూవీ కావ‌డంతో ఈ సినిమా పై మ‌రింత ఆస‌క్తి ఏర్ప‌డింది.

అయితే.. వీర‌మ‌ల్లు త‌ర్వాత స్టార్ట్ అయిన భీమ్లా నాయ‌క్ రిలీజ్ అయ్యింది కానీ.. వీర‌మ‌ల్లు మాత్రం ఇంకా షూటింగ్ పూర్తి చేసుకోలేదు. మధ్యలో ఏదో మేకింగ్ విషయంలో తేడా వచ్చింది అని అవుట్ పుట్ బాగా రావడం లేదు అని కామెంట్స్ కూడా చాలానే వచ్చాయి. వాటి పై కూడా చిత్ర యూనిట్ ఎలాంటి క్లారిటీ అయితే ఇవ్వలేదు. ఇక మొత్తానికి ఇప్పుడు క్రిష్ నిర్మాత ఏఎమ్.రత్నం చర్చలతో సినిమా రెగ్యులర్ షూటింగ్ సెప్టెంబర్ లో మొదలయ్యే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.

నిర్మాతలకు సంబంధించిన ఇతర సమస్యల కారణంగా కొనసాగిన బంద్ నేపథ్యంలో షూటింగ్స్ నిలిపివేసిన విషయం తెలిసిందే. ఇక ఆ గ్యాప్ ను పాలిటిక్స్ కోసం ఉపయోగించుకున్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు హరిహర వీరమల్లును సెప్టెంబర్ లో మొదలు పెట్టాలని చూస్తున్నట్లుగా తెలుస్తోంది. వినోదయ సీతం రీమేక్ కూడా తెరపైకి తీసుకురావాలి అని త్రివిక్రమ్ బాగానే ప్రయత్నాలు చేశాడు. కానీ..  ప‌వ‌న్ మాత్రం వీర‌మ‌ల్లు పూర్తైన త‌ర్వాతే వేరే సినిమాల గురించి ఆలోచించాల‌ని ఫిక్స్ అయ్యాడ‌ట‌. మ‌రి.. ఈసారైనా వీర‌మ‌ల్లు అడ్డంకులు లేకుండా షూటింగ్ పూర్తి చేసుకుంటుందేమో చూడాలి.

Also Read: ‘హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు’ తో దర్శక నిర్మాతల చర్చలు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular