Saturday, November 23, 2024
Homeస్పోర్ట్స్England(W) Vs India(W) : తొలి టి20లో ఇంగ్లాండ్ విజయం

England(W) Vs India(W) : తొలి టి20లో ఇంగ్లాండ్ విజయం

ఇండియా-ఇంగ్లాండ్ మహిళా క్రికెట్ జట్ల మధ్య నేడు జరిగిన తొలి టి 20 మ్యాచ్ లో ఇంగ్లాండ్ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఇండియా విసిరిన 132 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లాండ్ కేవలం ఒక వికెట్ మాత్రమే కోల్పోయి 13 ఓవర్లలోనే ఛేదించింది.

మూడు టి 20లు, మూడు వన్డే మ్యాచ్ ల సిరీస్ ఆడేందుకు భారత మహిళా క్రికెట్ జట్టు ఇంగ్లాండ్ లో పర్యటిస్తోంది. క్యాస్టర్ లీ స్ట్రీట్ రివర్ సైడ్ గ్రౌండ్ లో జరిగిన తొలి టి 20 లో ఇంగ్లాండ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఈ పిచ్ పై పరుగులు రాబట్టడంలో ఇండియా బ్యాట్స్ విమెన్ ఇబ్బంది పడ్డారు. దీప్తి శర్మ-29(నాటౌట్); స్మృతి మందానా-23; కెప్టెన్ హర్మన్ ప్రీత్-20 పరుగులతో ఫర్వాలేదనిపించారు. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 132 పరుగులు చేసింది.

ఇంగ్లాండ్ బౌలర్లలో సారా గ్లెన్ నాలుగు; డేవిస్, బ్రయోనీ స్మిత్ చెరో వికెట్ పడగొట్టారు.

ఆ తర్వాత ఇంగ్లాండ్ మహిళలు తొలి వికెట్ కు 60 పరుగులు జోడించారు. డానియల్ వ్యాట్ 16 బంతుల్లో 3 ఫోర్లతో 24 పరుగులు చేసి స్నేహ్ రానా బౌలింగ్ లో స్టంప్ ఔట్  గా వెనుదిరిగింది.  మరో ఓపెనర్ సొఫియా డంక్లీ 44 బంతుల్లో  8 ఫోర్లు, 1 సిక్సర్ తో 61;  ఆలిస్ కాప్సీ 20 బంతుల్లో 3ఫోర్లు, 2 సిక్సర్లతో 32 పరుగులతో నాటౌట్ గా నిలిచి విజయం అందించారు.

సారా గ్లెన్ కు ‘ప్లేయర్ అఫ్ ద మ్యాచ్’ లభించింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్