మొదటి నుంచి కూడా నాగార్జునకి రొమాంటిక్ హీరో ఇమేజ్ ఉంది. ఆ జోనర్ లో సినిమాలను కొనసాగిస్తూనే, అప్పుడప్పుడు యాక్షన్ సినిమాల ద్వారా కూడా ప్రేక్షకులను మెప్పించడానికి తనవంతు ప్రయత్నం చేస్తున్నారు. అలా ఆయన ఈ సారి ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ‘ది ఘోస్ట్‘ సినిమా చేశారు. దసరా కానుకగా ఈ సినిమాను అక్టోబర్ 5వ తేదీన భారీ స్థాయిలో రిలీజ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నిన్న రాత్రి ‘కర్నూల్’ వేదికగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ ఈవెంట్ కి నాగ్ తో పాటు వచ్చిన చైతూ – అఖిల్ ఇద్దరూ కూడా ప్రత్యేకమైన ఆకర్షణగా నిలిచారు.
నాగార్జున మాట్లాడుతూ .. ‘శివ’ సినిమా 33 ఏళ్ల క్రితం అక్టోబర్ 5వ తేదీన రిలీజ్ అయింది. ఆ సినిమా ఎంతటి సంచలనాన్ని సృష్టించిందో మీకు తెలుసు. ఇప్పుడు అదే రోజున ‘ఘోస్ట్’ మీ ముందుకు రానుంది. ‘శివ’ మాదిరిగానే ఈ సినిమాను కూడా హిట్ చేస్తారని భావిస్తున్నాను. ‘బంగార్రాజు’గా చైతూతో కలిసి మీ ముందుకు వస్తే రికార్డు స్థాయి హిట్ ఇచ్చారు. అఖిల్ తో కలిసి కూడా ఒక సినిమా చేయబోతున్నాను. త్వరలోనే ఆ సినిమా మొదలవుతుంది. మీ అందరి కేరింతలు ప్రత్యక్షంగా చూడటం కోసమే వాళ్లిద్దరినీ తీసుకొచ్చాను” అంటూ చెప్పుకొచ్చారు.
ఇక నాగ చైతన్య మాట్లాడుతూ .. “ఈ మధ్య నేను ఎప్పుడు కలిసినా నాన్న ఈ సినిమాను గురించే మాట్లాడుతూ వచ్చారు. ఆయనలో అంతటి ఎగ్జైట్ మెంట్ ను నేను ఇంతకుముందు చూడలేదు. ఆయనను ఒక స్టైలీష్ యాక్షన్ హీరోగా చూడాలని అనుకున్నాను. ఈ సినిమాతో ఆ కోరిక నెరవేరుతున్నందుకు ఆనందంగా ఉంది. అక్టోబర్ 5న కర్నూల్ లో స్క్రీన్లు చిరిగిపోవడం పక్కానే అనిపిస్తోంది” అన్నాడు. ఇక అఖిల్ మాట్లాడుతూ .. ” నటుడిగా 30 ఏళ్లు దాటినా నాన్నలో ఆ కసి .. ఆకలి తగ్గలేదనిపిస్తోంది. ఆయనను చూస్తుంటే మేము ఇంకా ఎంతగా పరిగెత్తాలనేది మాకు అర్థమవుతోంది” అంటూ చెప్పుకొచ్చాడు.
Also Read : ‘ది ఘోస్ట్’కు యూ/ఎ సర్టిఫికేట్