Sunday, May 19, 2024
Homeస్పోర్ట్స్ India Vs Australia T20: ఉప్పల్ లో ఇండియాదే గెలుపు- సిరీస్ కైవసం

 India Vs Australia T20: ఉప్పల్ లో ఇండియాదే గెలుపు- సిరీస్ కైవసం

సూర్య కుమార్ యాదవ్, విరాట్ కోహ్లీ బ్యాటింగ్ లో రాణించడంతో ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టి20లో ఇండియా 6 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించి సిరీస్ ను కూడా కైవసం చేసుకుంది. సూర్య కుమార్ 36 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్సర్లతో 69 పరుగుల చేసి ధనా ధన్ ఇన్నింగ్స్ ఆడాడు. కోహ్లీ 48  బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లతో 63 పరుగులు చేసి చివరి ఓవర్ రెండో బంతికి ఔటయ్యాడు. ఆ తర్వాత హార్దిక్ ఐదో బంతిని బౌండరీకి తరలించి విజయం ఖాయం చేశాడు.

హైదరాబాద్ లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం (ఉప్పల్)లో జరిగిన ఈ మ్యాచ్ లో ఇండియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఆస్ట్రేలియా తొలి వికెట్ కు 44 పరుగులు చేసింది, జట్టులో ఓపెనర్ కామెరూన్ గ్రీన్ 21 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సర్లతో 52; టిమ్ డేవిడ్ 27 బంతుల్లో 2 ఫోర్లు, 4  సిక్సర్లతో 54  పరుగులతో రాణించారు. జోస్ ఇంగ్లిస్­-24; డానియెల్ శామ్స్-28 పరుగులతో ఫర్వాలేదనిపించారు. మిగిలిన బ్యాట్స్ మెన్ సింగల్ డిజిట్ కే పరిమితమయ్యారు. నిర్ణీత 20 ఓవర్లలో ఆసీస్ 7 వికెట్లు కోల్పోయి 186 పరుగులు చేసింది.

ఇండియా బౌలర్లలో అక్షర్ పటేల్ మూడు; భువీ, చాహల్, హర్షల్ పటేల్ తలా ఒక వికెట్ పడగొట్టారు.

భారీ లక్ష్యంతో బరిలోకి  దిగిన ఇండియా ఐదు పరుగులకే తొలి వికెట్ కోల్పోయింది. కెఎల్ రాహుల్ (1) మరోసారి విఫలమయ్యాడు. కెప్టెన్ రోహిత్ కూడా 14  బంతుల్లో 17 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. ఈ దశలో కోహ్లీ-సూర్య కుమార్ యాదవ్ మూడో వికెట్ కు 104 పరుగుల చక్కని భాగస్వామ్యం నెలకొల్పారు.

హార్దిక్ పాండ్యా 16 బంతుల్లో 2  ఫోర్లు, ఒక సిక్సర్ తో 25 పరుగులతో అజేయంగా నిలిచాడు. మరో బంతి మిలిగి ఉండగానే ఇండియా లక్ష్యం ఛేదించింది.

ఆసీస్ బౌలర్లలో డానియెల్ శామ్స్ రెండు; హాజెల్ వుడ్, కమ్మిన్స్ చెరో వికెట్ పడగొట్టారు.

సూర్య కుమార్ యాదవ్ కు ‘ప్లేయర్ అఫ్ ద మ్యాచ్’….. అక్షర్ పటేల్ కు ‘ప్లేయర్ అఫ్ ద సిరీస్’ లభించాయి.

Also Read : Rohit is back: రెండో టి20లో ఇండియా విజయం 

RELATED ARTICLES

Most Popular

న్యూస్