Monday, May 20, 2024
Homeస్పోర్ట్స్హెడ్, అభిషేక్ విధ్వంసం: లక్నో పై హైదరాబాద్ అద్బుత విజయం

హెడ్, అభిషేక్ విధ్వంసం: లక్నో పై హైదరాబాద్ అద్బుత విజయం

హైదరాబాద్ సన్ రైజర్స్ ఓపెనర్లు పెను విధ్వంసం సృష్టించారు. లక్నో సూపర్ జెయింట్స్ ఇచ్చిన 166 పరుగుల విజయ లక్ష్యాన్ని కేవలం 9.4 ఓవర్లలోనే వికెట్ నష్టపోకుండా ఛేదించి రికార్డు సృష్టించారు. ట్రావిస్ హెడ్ 30 బంతుల్లో 8 ఫోర్లు, 8 సిక్సర్లతో 89; అభిషేక్ శర్మ28 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్సర్లతో 75 పరుగులతో అజేయంగా నిలిచి మరో 62 బంతులు మిగిలి ఉండగానే అద్భుత విజయం అందించారు.

హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో నేడు జరిగిన మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న లక్నో 21 పరుగులకే 2 వికెట్లు (ఓపెనర్ డికాక్ 2; స్టోనిస్ 3) కోల్పోయింది. కెఎల్ రాహుల్ 29 పరుగులు చేసి మూడో వికెట్ గా వెనుదిరిగాడు. కృనాల్ పాండ్యా (24) వేగంగా పరుగులు చేసినా కమ్మిన్స్ విసిరిన ఓ చక్కని బంతికి రనౌట్ అయ్యాడు. ఈ దశలో నికోలస్ పూరన్ (48), ఆయూష్ బదోనీ(55)లు ఐదో వికెట్ కు అజేయంగా 99 పరుగులు జోడించి జట్టు గౌరవప్రదమైన స్కోరు సాధించడంలో తోడ్పడ్డారు. హైదరాబాద్ బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ 2; కమ్మిన్స్ 1 వికెట్ పడగొట్టారు.

ట్రావిస్ హెడ్ 16 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేయగా, అభిషేక్ 18 బంతుల్లో పూర్తి చేయడం విశేషం.

హెడ్ కు ప్లేయర్ అఫ్ ద మ్యాచ్ దక్కింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్