Thursday, June 11, 2026
HomeTrending Newsమంత్రుల కాన్యాయ్ పై జనసేన కార్యకర్తల దాడి

మంత్రుల కాన్యాయ్ పై జనసేన కార్యకర్తల దాడి

విశాఖపట్నం ఎయిర్ పోర్ట్ సమీపంలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది.   రాష్ట్ర మంత్రులు జోగి రమేష్, ఆర్కే రోజా, టిటిడి చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ల వాహనాలపై జనసేన కార్యకర్తలు దాడికి ప్రయత్నించారు. చెప్పులు, చీపుర్లు విసిరిన కొంతమంది కార్యకర్తలు… కార్ల అద్దాలపై పిడిగుద్దులు కురిపించారు.  నేడు విశాఖలో వికేంద్రీకరణకు మద్దతుగా వైసీపీ, నాన్-పొలిటికల్ జేఏసి ఆధ్య్వయంలో జరిగిన విశాఖ గర్జనలో పాల్గొన్న అనంతరం మంత్రులు, నేతలు తిరిగి వెళ్లేందుకు ఎయిర్ పోర్ట్ కు బయల్దేరారు. అయితే ఆ సమయానికే మూడు రోజుల ఉత్తరాంధ్ర పర్యటనకు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఎయిర్ విశాఖ ఎయిర్ పోర్ట్ కు చేరుకున్నారు, ఆయనకు స్వాగతం పలికేందుకు పెద్ద ఎత్తున జనసేన కార్యకర్తలు, పవన్ అభిమానులు చేరుకున్నారు. మంత్రుల కాన్వాయ్ కనబడగానే ఒక్కసారిగా వారు ఆవైపు దూసుకు వెళ్ళారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు జనసేన కార్యకర్తలను ఆడుకున్నారు.

Also Read : దేనికి గర్జనలు?: జనసేనాని వరుస ట్వీట్లు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular