విమానంలో పాము కనిపించడంతో.. దాంట్లో ప్రయాణిస్తున్న ప్రయాణికులు ఆందోళనకు గురైయ్యారు. ఈ ఘటన అమెరికాలోని నివార్క్ లిబర్టీ అంతర్జాతీయ ఎయిర్‌పోర్ట్‌లో జరిగింది. ఫ్లోరిడాలోని టంపా సిటీ నుంచి న్యూజెర్సీకి వచ్చిన విమానంలో ఓ పాము ప్రయాణికులను టెన్షన్‌కు గురిచేసింది. నివార్క్ విమానాశ్రయంలో ల్యాండ్ అయిన సమయంలో బిజినెస్ క్లాస్‌లో ఆ పాము కనిపించింది. ఒక్కసారిగా ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు.
విమానం ల్యాండ్ అయిన తర్వాత ట్యాక్సింగ్ చేస్తున్నప్పుడు బిజినెస్ క్లాస్‌లో కూర్చున్న ప్రయాణికులు ఆ పామును గుర్తించారు. టెన్షన్‌కు గురైన ప్రయాణికులు సీట్లపైకి వెళ్లిపోయారు. విమాన సిబ్బంది వైల్డ్‌లైఫ్ ఆపరేషన్స్‌కు సమాచారం ఇచ్చారు. పామును పట్టుకున్న తర్వాతే ప్రయాణికులు విమానం నుంచి దిగారు.
గార్టర్ పాములు ఫ్లోరిడాలో చాలా ఎక్కువగా కనిపిస్తుంటాయి. అవి విషసర్పాలు కావు. సుమారు 18 నుంచి 26 ఇంచుల వరకు పొడుగు ఉంటాయి. న్యూజెర్సీలోనూ ఇలాంటి సర్పాలు అధికంగా ఉంటాయి.