టి20 వరల్డ్ కప్ లో నేడు జరిగిన తొలి మ్యాచ్ లో నెదర్లాండ్స్ పై బంగ్లాదేశ్ 9 పరుగుల తేడాతో విజయం సాధించింది. బంగ్లా బౌలింగ్ దెబ్బకు నెదర్లాండ్స్ 15 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది. సహచారులంతా పెవిలియన్ బాట బడుతున్నా కోలిన్ ఆకెర్మాన్ 48 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 62 పరుగులు చేసి తొమ్మిదో వికెట్ గా వెనుదిరిగాడు. ఒక దశలో భారీ తేడాతో ఓటమి తప్పదనుకున్న మ్యాచ్ ను చివరి వరకూ తీసుకువెళ్ళాడు.
అంతకుముందు, హోబర్ట్ లోని బెల్లిరివ్ ఓవల్ మైదానంలో జరిగిన ఈ మ్యాచ్ లో నెదర్లండ్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. బంగ్లాదేశ్ లో అఫిఫ్ హోస్సేన్-38; ఓపెనర్ శాంటో-25; మోసాద్దెకే హోస్సేన్- 20 పరుగులతో రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 144 పరుగులు చేసింది.
డచ్ బౌలర్లలో వాన్ మీకీరన్, బాస్ దే లీదే చెరో రెండు; ఫ్రెడ్ క్లాసేన్, టిం ప్రింగిల్, షరిజ్ అహ్మద్, వాన్ బీక్ తలా ఒక వికెట్ పడగొట్టారు.
నెదర్లాండ్స్ తొలి ఓవర్లోనే పరుగులేమీ చేయకుండానే రెండు వికెట్లు కోల్పోయింది. మొత్తం ముగ్గురు టాపార్డర్ బ్యాట్స్ మెన్ డకౌట్ అయ్యారు. కొలిన్-62; పాల్ వెన్ మీకీరన్-24; స్కాట్ ఎడ్వర్డ్స్-16 పరుగులతో… ముగ్గురు మాత్రమే రెండంకెల స్కోరు చేశారు.
బంగ్లా బౌలర్లలో తస్కిన్ అహ్మద్ నాలుగు; హసన్ మహ్మూద్ రెండు; షకీబ్ అల్ హసన్, సౌమ్య సర్కార్ చెరో వికెట్ పడగొట్టారు.
తస్కిన్ కు ‘ప్లేయర్ అఫ్ ద మ్యాచ్’ దక్కింది.
Also Read : Kohli is back: పాకిస్తాన్ పై ఇండియా ఉత్కంఠ విజయం