Friday, March 29, 2024
HomeTrending Newsచిన్న పిల్లలపై లైంగిక అత్యాచారాలు

చిన్న పిల్లలపై లైంగిక అత్యాచారాలు

ప్రపంచవ్యాప్తంగా చిన్న పిల్లలపై లైంగిక అత్యాచారాలు ఎక్కువగా జరుగుతున్నాయి. మూడో ప్రపంచ దేశాల్లో చిన్న పిల్లలపై  అఘాయిత్యాలు జరుగుతున్నా.. ప్రభుత్వపరంగా నియంత్రణ జరగటం లేదు. భారత దేశంలో ఈ సమస్య అందరూ అనుకొన్న దానికన్నా తీవ్రంగా ఉంది. సుమారు అయిదువందల ఘటనలు జరిగితే ఒకటో- రెండో మాత్రం వెలుగులోకి వస్తున్నాయి.

అత్యాచారాలు చేసేవారు ఎవరు ?

పదేళ్ల బాలుడి నుంచి డెబ్భై ఏళ్ళ ముదుసలి వరకు ఉన్నారు. ఇలాంటి చర్యలకు పాలుపడుతున్నవారిలో ఎక్కువ శాతం నలభై- యాభై వయసు దాటిన వారే. తొమ్మిది నెలల పసికందు నుంచి ఎనభై ఏళ్ళ వృద్ధుల దాకా అఘాయిత్యాలకు గురయ్యారు. అమ్మాయిలపైనే లైంగిక అత్యాచారాలు జరుగుతాయి అనుకోవడం తప్పు. స్వలింగ సంపర్కులు అబ్బాయిల పైన అఘాయిత్యాలు చేస్తారు.

ఎందుకిలా ?

చిన్న పిల్లల పై లైంగిక అత్యాచారాలకు పాల్పడే వారిని స్థూలంగా రెండు రకాలుగా విభజించొచ్చు.

1. పెడెఫిలీ నేరస్తులు 2. అవకాశవాద నేరస్తులు

1 పెడోఫిలి నేరస్తులు – చిన్న పిల్లలపై జరిగే అత్యాచారాల్లో యాభై శాతం ఇలాంటి వారి వల్లే. వీరి మెదడు నిర్మాణం మిగతావారితో పోలిస్తే బిన్నంగా ఉంటుందని పరిశోధనల్లో తేలింది. వీరు సాధారణంగా ఎడమ చేతివాటం కలిగివుంటారు. ఎడమ చేతివాటం కలిగిన వారందరూ ఇలాంటివారు కాదని గమనించగలరు. వీరు మిగతా వారితో పోలిస్తే కాస్త పొట్టిగా వుంటారు. కానీ అందరు ఫెడోఫిలి నేరస్తులు ఎడమచేతివాటం కలిగి ఉంటారని, పొట్టిగా ఉంటారని చెప్పలేము. ఒక్క మాటలో చెప్పాలంటే వీరు మిగతావారిలాగే కనిపిస్తారు.

కేవలం సైకోమెట్రిక్ టెస్ట్ ల ద్వారా ఇలాంటి వారిని గుర్తించగలం. పెడోఫిలి నేరస్తులు యుక్త వయసులోనే ఇలాంటి చర్యలు ప్రారంభిస్తారు. ప్రపంచ వ్యాప్త డేటా తీస్తే ఇలాంటి వారు తమ జీవిత కాలంలో ముప్పై నుంచి నలబై మంది పిల్లలపై అత్యాచారాలు చేస్తారు.

2. అవకాశవాద నేరస్తులు : వీరిని ఘరానా పెద్దమనుషులు అని పిలవొచ్చు. వీరి సెక్స్ వాంఛ తీవ్రంగా ఉంటుంది. అది తీర్చుకోవడానికి పిల్లల్ని ఎంచుకొంటారు. చిన్న పిల్లలైతే సులభంగా లొంగదీసుకోవచ్చు,  బయటకు పొక్కదు అని వీరి ఆలోచన. వీరు ఇంట్లో, పక్కింట్లో వ్యక్తులు, స్కూల్ ఇంకా మత పరమైన సంస్థలు మొదలైన సంస్థల్లో పని చేసేవారు.  పెద్దమనిషిగా చెలామణి అవుతూ ఎవరికీ తెలియకుండా విషయం బయటకు పొక్కకుండా వీరు తమ అఘాయిత్యాలను కానిస్తుంటారు.

పిల్లలపై జరిగే లైంగిక దాడుల్లో కేవలం పది శాతం మాత్రమే అపరిచితుల ద్వారా జరుగుతాయి.  తొంబై శాతం కేసుల్లో నేరస్తులు పరిచయస్తులే మేకవన్నె పులి మాదిరిగా వ్యవహరిస్తారు. ఎలా గుర్తించాలి ?

మూడేళ్ళ క్రితం వరంగల్ దగ్గర ఒక ఘటన జరిగింది. తల్లి పక్కన నిద్ర పోతున్న తొమ్మిది నెలల పసికందును తీసుకొని వెళ్లి రేప్ చేసి చంపేశాడు. ఇలాంటి ఘటనలు చాలా అరుదు. ఎక్కువ శాతం కేసుల్లో నేరస్థులు నేరం చేసే ముందు ఈ కింది ప్రవర్తనా రీతిని కనబరుస్తారు .

1 . పిల్లలపై అభిమానం / ప్రేమ ఉన్నట్టు నటిస్తారు. వారికి దగ్గరగా ఉండడానికి ప్రయత్నిస్తారు. పక్కన కూర్చోవడం / ఒడిలో కుర్చోపెట్టుకోవడం, బహుమానాలు ఇవ్వడం, పిల్లల అవసరాలు తీర్చడం, పిల్లలకు దగ్గరయ్యేందుకు వారి కుటుంబ సభ్యులతో స్నేహం నటించడం, పిల్లలని తదేకంగా చూడడం లాంటివి చేస్తారు.

2 పిల్లలకు దగ్గయ్యేందుకు వీరు పాఠశాలలను ముఖ్యంగా రెసిడెన్షియల్ పాటశాలల్ని ఒక అవకాశంగా తీసుకొంటారు. తమకు ఉపాధ్యాయ వృత్తి పై మక్కువ లేకున్నా కేవలం ఈ కారణంతో దీన్ని వృత్తిగా ఎంచుకొంటారు. ప్రతి మూడు నాలుగు పాఠశాలలలో ఇలాంటి వాడు ఒక్కడున్నాడు. బయట పడినవి తక్కువ. పడనివి ఎక్కువ. కొద్దీ పాటి ట్రై చేసి వీలు కాక భయంతో ఆపేసి మంచి సమయం కోసం చూసే వారు ఎక్కువ.

3 తమ నేరం బయటపడుతుందేమో అన్న భయం వీరిలో ఉంటుంది. అందుకే ఒక పద్ధతిలో వీరు క్రైమ్ కు పూనుకొంటారు. ముందుగా తాను ఎంచుకొన్న అమ్మాయి / అబ్బాయి వీపుపైన, తొడపైన చెయ్యి వేసి నిమరడం లాంటివి చేస్తారు. వారు వద్దని దూరంగా జరిగితే అక్కడితో ఆపేస్తారు. పిల్లలు అమాయకత్వం కొద్దీ లేదా టీన్ ఏజ్ లోని పిల్లలు హార్మోన్ ప్రభావంతో ప్రతిస్పందన చూపితే కాస్త ముందుకు సాగుతారు.

4 పిల్లలకు బూతు, నీలి చిత్రాలు, నగ్న, అర్ధ గ్న ఫోటోలు చూపడం { ముఖ్యంగా టీన్ ఏజ్ ప్రాంగణంలోని పిలల్లకు } వారు స్పందిస్తే కొంటెగా మాట్లాడడం, ఇలా చేద్దామా అని చెప్పడం లాంటివి చేస్తారు.

ఎప్పుడు ప్రారంభయ్యింది ?

వందల ఏళ్ళ నుంచి ఇది జరుగుతోంది. బయట పడిన సందర్భాలు అరుదు. కానీ గత ఇరవై ఏళ్లుగా ఇలాంటి ఘటనలు భారీగా పెరిగాయి.

దీనికి కారణాలు .. 1 . మద్యం . 2 డ్రగ్స్ . 3 . స్మార్ట్ ఫోన్ లు -.

పోర్న్ కంటే యు ట్యూబ్ లో వెబ్ సిరీస్ లో వచ్చే రెచ్చగొట్టే మాటలు, బూతులు ఉన్న వీడియోలు ఎక్కువ ప్రభావాన్ని చూపుతున్నాయి. తాము యు ట్యూబ్ ఛానల్ లో వచ్చే రెచ్చే గొట్టే మాటలు అర్ధ నగ్న దృశ్యాలతో ప్రభావితమయ్యి అదుపు తప్పిన సెక్స్ వాంఛ వల్లే ఇలాంటి చేసామని పోలీసుల విచారణలో నేరస్తులు చెప్పారు.

వాసిరెడ్డి అమరనాథ్

RELATED ARTICLES

Most Popular

న్యూస్