Sunday, November 24, 2024
Homeస్పోర్ట్స్ICC Men’s T20 World Cup 2022: సౌతాఫ్రికా గెలుపుకు వర్షం అడ్డు

ICC Men’s T20 World Cup 2022: సౌతాఫ్రికా గెలుపుకు వర్షం అడ్డు

సౌతాఫ్రికా జట్టును మరోసారి వర్షం రూపంలో దురదృష్టం వెంటాడింది. జింబాబ్వేతో నేడు జరిగిన మ్యాచ్ ను వర్షం కారణంగా రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.

హోబర్ట్ లోని బెల్లీరివ్ మైదానంలో జరిగిన ఈ మ్యాచ్ ను వర్షం కారణంగా 9 ఓవర్లకు కుదించారు. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం ఒకటిన్నరకు ప్రారంభం కావాల్సిన ఈ మ్యాచ్ 3.46 గంటలకు మొదలైంది.  సౌతాఫ్రికా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. జింబాబ్వే 19 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది. ఐదో వికెట్ కు మధేవెరే -మిల్టన్ శుంబా 60 పరుగులు జోడించారు. మధేవెరే 18 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్సర్ తో 35 పరుగులతో నాటౌట్ గా నిలవగా, మిల్టన్ 18 పరుగులు చేసి ఇన్నింగ్స్ చివరి బంతికి ఔటయ్యాడు. దీనితో నిర్దేశిత 9 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 79 పరుగులు చేసింది.

సౌతాఫ్రికా బౌలర్లలో నిగిడి రెండు; పార్నెల్, నార్త్జ్ చెరో వికెట్ పడగొట్టారు.

సౌతాఫ్రికా తొలి ఓవర్లోనే 23 పరుగులు రాబట్టింది. మూడు ఓవర్లు పూర్తయ్యే సమయానికి వికెట్ కోల్పోకుండా 51 పరుగులు చేసింది.  ఓపెనర్ డికాక్ మరోసారి బంతితో విధ్వసం సృష్టించి 18 బంతుల్లో 8 ఫోర్లు, 1 సిక్సర్ తో 47; కెప్టెన్ బావుమా 2  పరుగులతో క్రీజులో ఉన్నారు. ఈ సమయంలో మరోసారి భారీ వర్షం పడి మైదానం చిత్తడిగా మారింది. మ్యాచ్ ను కొనసాగించే పరిస్థితులు లేకపోవడంతో రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు.

ఈ రకంగా మరోసారి సౌతాఫ్రికా విజయాన్ని వరుణదేవుడు అడ్డుకున్నాడు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్