Saturday, June 13, 2026
HomeTrending Newsబిజెపి, తెరాస రెండు ఒకటే - రాహుల్ గాంధీ

బిజెపి, తెరాస రెండు ఒకటే – రాహుల్ గాంధీ

ప్రధాని మోదీ హయాంలో ప్రణాళికా బద్దంగా రాజ్యాంగ వ్యవస్థలను నాశనం చేశారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆందోళన వ్యక్తం చేశారు. ఇది దేశానికి నష్టదాయకమన్నారు. భారత్ జోడో యాత్రలో భాగంగా ఈ రోజు ఉదయం షాద్ నగర్ నుంచి పాదయాత్ర ప్రారంభించిన రాహుల్ గాంధి రంగారెడ్డి జిల్లా కొత్తూర్, పెద్ద షాపూర్ మీదుగా కొద్ది సేపటి క్రితం శంషాబాద్ చేరుకున్నారు. పాదయాత్ర సమయంలో కొద్ది సేపు మీడియాతో మాట్లాడిన రాహుల్ గాంధి బిజెపి, తెరాస లపై ఘాటుగా విమర్శలు చేశారు.

రాహుల్ విమర్శలు ఆయన మాటల్లోనే…

నరేంద్రమోడి  ఉద్యోగాల కల్పన లేకుండా చేశారు. దేశంలో బీజేపీ, రాష్ట్రంలో తెరాస ఒకే విధానాన్ని అవలంబిస్తున్నాయి. సంపదను కొద్ది మంది వ్యాపారుల చేతుల్లో పెడుతున్నారు. దేశ సమైక్యత కోసమే మేం భారత్ జోడో యాత్ర చేపట్టాం. బీజేపీ విద్వేష రాజకీయాలను తిప్పికొట్టాలనే మా ప్రయత్నం. మేం కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు రూట్ ను ఎంచుకున్నాము. వీలైనన్ని ఎక్కువ రాష్ట్రాలలో యాత్ర కొనసాగేలా చేసుకున్నాం. అంతే కాని గుజరాత్ లో యాత్ర సాగించకూడదని కాదు. కాంగ్రెస్ ప్రజాస్వామిక పార్టీ.. ఇక్కడ నియంతృత్వం ఉండదు. ప్రజాస్వామ్య పద్దతిలో కాంగ్రెస్ అధ్యక్షుడిని ఎన్నుకుంది. కానీ బీజేపీ, తెరాస, ఇతర పార్టీలు ఎప్పుడైనా ఇలా ఎన్నుకున్నాయా?

బీజేపీ, టీఆరెస్ లు ప్రజాధనాన్ని దోచుకుంటున్నాయి. అందుకే ఆ రెండు పార్టీలు ఒకటే అని పదే పదే చెబుతున్నా. టీఆరెస్ తో కాంగ్రెస్ పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదు. అవినీతిమయమైన, ప్రజా ధనాన్ని లూటీ చేసే ఆ పార్టీతో పొత్తు ఉండదు. రాజకీయంగా కొందరు నాయకులు ఎవరికి వారు తామది పెద్ద పార్టీగా ఊహించుకోవచ్చు. టీఆరెస్ కూడా తమకు తాము నేషనల్ పార్టీ, గ్లోబల్ పార్టీ అని ఊహించుకోవడంలో తప్పులేదు.

చాలా సంవత్సరాల క్రితమే నేను భారత్ జోడో యాత్ర చేయాలనుకున్న. కానీ కోవిడ్ విజృంభించడం, ఇతర కారణాలతో చేయలేకపోయా. ఈ యాత్రతో వ్యక్తిగతంగా ఎన్నో నేర్చుకుంటున్నా, కాంగ్రెస్ పార్టీ ఉన్నతికి కూడా ఈ యాత్ర ఉపయోగ పడుతుంది. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది. భారత్ జోడో యాత్ర క్రీడా యాత్ర కాదు.. ఖచ్చితంగా పొలిటికల్ యాత్రే. ప్రస్తుతం నేను కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు పాదయాత్రను కొనసాగించడమే నా లక్ష్యం. రాజకీయపరమైన అంశాలపై యాత్ర ముగిశాకే మాట్లాడుతా. ప్రజలతో మమేకమవడానికి ఈ యాత్ర ఒక గొప్ప ముందడుగు.

Also Read : బిజెపి నేతల వ్యాఖ్యలకు… పూనమ్ కౌర్ స్ట్రాంగ్ కౌంటర్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular