Saturday, June 13, 2026
Homeసినిమాసుజిత్ కి షాక్ ఇచ్చిన పవర్ స్టార్?

సుజిత్ కి షాక్ ఇచ్చిన పవర్ స్టార్?

‘రన్ రాజా రన్’ తో దర్శకుడిగా పరిచయమై.. తొలి సినిమాతోనే సక్సెస్ సాధించిన డైరెక్టర్ సుజిత్. ఆ తర్వాత ఏకంగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో  సాహో సినిమా చేసే లక్కీ ఛాన్స్ దక్కించుకున్నాడు. సాహో కోసం సుజిత్ చాలా సంవత్సరాలు వెయిట్ చేసి, కథపై చాన్నాళ్లు కసరత్తు చేసి రూపొందించారు. ఆఖరికి ఈ సినిమా ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయింది.  చిరంజీవి గాడ్ ఫాదర్ మూవీని రీమేక్ చేసే ఛాన్స్ వచ్చింది కానీ.. సుజిత్ చేసిన మార్పులు చేర్పులు చిరంజీవికి నచ్చలేదు. దీంతో ఈ ప్రాజెక్ట్ నుంచి సుజిత్ తప్పుకున్నాడు. ఆ తర్వాత ఇప్పటి వరకు సుజిత్ నెక్ట్స్ మూవీ ఎవరితో అనేది ప్రకటించలేదు కానీ.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో సుజిత్ ప్రాజెక్ట్ కన్ ఫర్మ్ అయ్యిందని తెలిసింది. ఈ క్రేజీ ప్రాజెక్ట్ ను ఆర్ఆర్ఆర్ ప్రొడ్యూసర్ డీవీవీ దానయ్య నిర్మించనున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. త్వరలో ఈ సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్లేందుకు నిర్మాణ సంస్థ ఏర్పాట్లు చేస్తుంది. ఈ ప్రాజెక్ట్ ను మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ సెట్ చేశారని సమాచారం.

అయితే.. ఇప్పుడు పవర్ స్టార్ పొలిటికల్ గా బాగా బిజీ అయ్యారు. అందుచేత క్రిష్ డైరెక్షన్ లో చేస్తున్న హరి హర వీరమల్లు సినిమాని మాత్రమే కంప్లీట్ చేయాలనుకుంటున్నారట. ఈ సినిమా తర్వాత ‘భవదీయుడు భగత్ సింగ్’ చేయాల్సివుంది కానీ.. ఈ ప్రాజెక్ట్ కూడా ఆగిపోయిందని  సమాచారం. సుజిత్ మూవీ కూడా ఇప్పట్లో లేనట్టే అంటున్నారు. రన్ రాజా రన్ తర్వాత సాహోకి గ్యాప్ వచ్చింది. ఇప్పుడు సాహో తర్వాత నెక్ట్స్ ప్రాజెక్ట్ కి కూడా గ్యాప్ వచ్చింది. ఇది సుజిత్ కి షాకే. మరి.. సుజిత్ నెక్ట్స్ ప్రాజెక్ట్ ఎవరితో ఉంటుందో..?  ఎప్పుడు ఉంటుందో.?  చూడాలి.

Also Read : పవన్ తో అనుకుంటే.. మరో హీరోతో సెట్ అయ్యిందా..?  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular