Sunday, June 7, 2026
Homeసినిమా'మణిశంకర్' మూవీ అందరికీ నచ్చుతుంది - సంజన

‘మణిశంకర్’ మూవీ అందరికీ నచ్చుతుంది – సంజన

సంజన గ‌ల్రాని, ప్రియా హెగ్దే, చాణ‌క్య ప్ర‌ధాన పాత్ర‌ల‌లో న‌టిస్తోన్న చిత్రం ‘మణిశంకర్‘. డ‌బ్బు చుట్టూ తిరిగే ఒక ఆస‌క్తిక‌ర‌మైన క‌థ‌-క‌థ‌నాల‌తో యాక్ష‌న్ ఎలిమెంట్స్‌తో ఒక డిఫ‌రెంట్ మూవీగా తెర‌కెక్కింది. ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వ భాద్య‌త‌ల్ని జి.వి.కె(జి. వెంక‌ట్‌ కృష్ట‌ణ్‌) నిర్వ‌హించారు. లైట్ హౌస్ సినీ క్రియేషన్స్ ప‌తాకంపై కె.ఎస్. శంకర్ రావు, ఆచార్య శ్రీ‌నివాస‌రావు, ఎం. ఫణిభూషణ్ సంయుక్తంగా నిర్మించారు. ఇప్ప‌టికే ఈ మూవీ నుండి విడుద‌లైన ప్ర‌మోష‌న‌ల్ కంటెంట్‌కి మంచి స్పంద‌న ల‌భించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ చిత్రయూనిట్ మీడియా ముందుకు వచ్చింది. విడుదల తేదీ పై దర్శక నిర్మాతలు ప్రకటన చేశారు.

ఈ సందర్భంగా సంజన గల్రానీ మాట్లాడుతూ…‘కరోనా తరువాత నాకు ఈ ఆఫర్ వచ్చింది. శివ కంఠమనేని, బాబి గారికి థాంక్స్. శివ కంఠమనేని గారికి సినిమా అంటే ఎంతో ప్యాషన్. చక్కగా నటించారు. ఆయన ఎంతో ఎత్తుకు ఎదగాలని కోరుకుంటున్నాను. ప్రభాకర్ రెడ్డి గారితో పని చేయడం ఆనందంగా ఉంది. మా నిర్మాతలు చాలా మంచి వారు. చక్కటి ప్లానింగ్‌తో సినిమాను నిర్మించారు. ఈ చిత్రయూనిట్‌తో పని చేయడం నాకు ఆనందంగా ఉంది. సినిమా అందరికీ నచ్చుతుంది. అందరూ మాకు సపోర్ట్ చేయండి అని అన్నారు.

Also Read : ‘మ‌ణిశంక‌ర్’ ఫ‌స్ట్‌ లుక్ మోష‌న్ పోస్ట‌ర్‌ 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular