మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజా రవితేజ కలిసి నటిస్తున్న చిత్రం ‘వాల్తేరు వీరయ్య‘. ఈ చిత్రానికి బాబీ దర్శకత్వం వహించారు. సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదల కానుంది. మైత్రీ మూవీ మేకర్స్ ఈ మెగా ఎంటర్ టైనర్ ను గ్రాండ్ కాన్వాస్ లో నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రచార కంటెంట్ కు అద్భుతమైన స్పందన వచ్చింది. చిరంజీవి – రవితేజ కాంబినేషన్ ని బిగ్ స్క్రీన్ మీద చూసేందుకు ప్రేక్షకులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇటీవల విడుదలైన రవితేజ టీజర్ యూట్యూబ్ లో భారీ రెస్పాన్స్ తో ట్రెండింగ్ లో ఉంది. బాస్ పార్టీ పాట 25 మిలియన్ల కంటే ఎక్కువ వ్యూస్ సంపాదించి సోషల్ మీడియా ట్రెండింగ్ రీల్స్ లో నిలిచింది.
ఇప్పుడు, మేకర్స్ అనూహ్య రీతి లో అవుట్ డోర్ ప్రమోషన్ లకు సిద్ధమవుతున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని అన్ని థియేటర్లకు స్టాండీలను పంపించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. స్టాండీస్ పై ఉండే పోస్టర్ ను విడుదల చేశారు. పోలీసు స్టేషన్ లో ఒక భారీ యాక్షన్ సన్నివేశం నుండి మెగాస్టార్ చిరంజీవి స్టిల్ ని విడుదల చేయడం జరిగింది. ఇందులో వీరయ్య గా మెగాస్టార్ చిరంజీవి ఒక చేతికి సంకెళ్లతో బ్యాగ్రౌండ్ లో తుపాకీలతో గంభీరంగా కూర్చుని కనిపిస్తున్నారు. మసాలా జోడించి, థియేటర్ల లో ఈ ఎపిసోడ్ కి ‘పూనకాలూ గ్యారెంటీ’ అనే విధం గా డైరెక్టర్ బాబీ ట్విట్టర్ లో ఈ స్టిల్ ని విడుదల చేశారు. ప్రేక్షకులు మరియు మెగా ఫ్యాన్స్ ఇంకెంతమాత్రం వెయిట్ చేయలేము అంటూ స్పందించారు. సినిమా టాకీ పార్ట్ మొత్తం పూర్తయింది. చివరి పాటను ప్రస్తుతం చిరంజీవి మరియు శృతి హాసన్ లపై యూరప్ లో చిత్రీకరిస్తున్నారు.
Also Read : భారీ వ్యూస్ తో వాల్తేరు వీరయ్య ఫస్ట్ సింగిల్