Wednesday, June 17, 2026
HomeTrending Newsరైతు సంఘాలతో బి.ఆర్.ఎస్ అధినేత కెసిఆర్

రైతు సంఘాలతో బి.ఆర్.ఎస్ అధినేత కెసిఆర్

ఢిల్లీ 5 ఎస్పీ మార్గ్ లో మొన్న ప్రారంభమైన బి ఆర్ ఎస్ పార్టీ జాతీయ కార్యాలయాన్ని ఈ రోజు (శుక్రవారం) బి ఆర్ ఎస్ అధినేత,సీఎం కేసిఆర్ సందర్శించారు. మధ్యాహ్నం..1.38 గం.లకు ఆఫీస్ కు చేరుకున్న కెసీఆర్ తన ఛాంబర్ లో కూర్చొని ఎంపీలు, పలు రాష్ట్రాల రైతు సంఘాల నేతలు ప్రముఖులతో వివిధ అంశాలపై చర్చించారు. కార్యాలయ మొదటి రెండో అంతస్థుల్లో ఏర్పాటు చేసిన కాన్ఫరెన్స్ హల్ ను, పలువురికి కేటాయించిన చాంబర్లను, కలియతిరిగి పరిశీలించారు. ఈ సందర్భంగా, పలు సూచనలు చేశారు. ఆనంతరం తనను కలిసేందుకు అక్కడికి చేరుకున్న బి ఆర్ ఎస్ నేతలు,కార్యకర్తలు అభిమానులకు,అభివాదం చేస్తూ,పలకరిస్తూ ముందుకు సాగారు. ఈ.సందర్భంగా జై భారత్ జై కేసిఆర్ జై బి ఆర్ ఎస్ నినాదాలు పార్టీ పరిసర ప్రాంతాల్లో మారుమోగాయి. కెసిఆర్ వెంట పార్లమెంటరీ పార్టీ నేతలు కె. కేశవరావు, నామ నాగేశ్వర్ రావు తో పాటు పలువురు ఎంపీ లు, తదితరులు ఉన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular