Sunday, March 8, 2026
HomeTrending Newsదిగొచ్చిన కేసులు - పెరిగిన మరణాలు

దిగొచ్చిన కేసులు – పెరిగిన మరణాలు

దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. తాజాగా కొత్త కేసులు తగ్గినప్పటికీ మరణాలు మాత్రం భారీగా పెరిగాయి. నిన్న 17,40,325 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 31,443 మందికి పాజిటివ్‌గా తేలింది. 118 రోజుల కనిష్ఠానికి కొత్త కేసులు క్షీణించాయి. అయితే గత 24 గంటల వ్యవధిలో 2020 మంది ప్రాణాలు కోల్పోయారు. గత కొన్ని రోజులుగా 1,000లోపు నమోదవుతోన్న మరణాల సంఖ్యలో.. భారీ పెరుగుదల చోటుచేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. ఇక దేశంలో మొత్తం కేసులు 3.09 కోట్లకు  చేరగా 4,10,784 మంది మహమ్మారికి బలయ్యారు.

నిన్న ఒక్కరోజే 49,007 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దాంతో మొత్తం రికవరీలు 3 కోట్ల మార్కును దాటాయి. రికవరీ రేటు 97.28 శాతానికి పెరగ్గా క్రియాశీల రేటు 1.40 శాతానికి తగ్గింది. ప్రస్తుతం 4,32,778 మంది కొవిడ్‌తో బాధపడుతున్నారు.

ఒక్కసారిగా మరణాలు ఎందుకు పెరిగాయంటే

రెండో దఫా విజృంభణలో మే నెలలో 4,500కుపైగా మరణాలు చోటుచేసుకున్నాయి. ఆ తర్వాత స్వల్ప హెచ్చుతగ్గులతో తగ్గుముఖం పట్టాయి. కొద్ది రోజులుగా వెయ్యికి దిగువనే నమోదవుతున్నాయి. జులై 5న  అత్యల్పంగా 553 మంది ప్రాణాలు కోల్పోయారు. నిన్న మృతుల సంఖ్య ఒకేసారి భారీగా పెరిగి 2,020కి చేరడం ఆందోళన కలిగించింది. అయితే మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం మరణాల లెక్కను సవరించడంతో ఈ అనూహ్యమైన మార్పు చోటుచేసుకుంది. అ ఒక్క రాష్ట్రం నుంచే నిన్న 1,481 మరణాలు నమోదయ్యాయి.

38 కోట్ల డోసులు పంపిణీ

జనవరి 16న కేంద్రం కరోనా టీకా కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇప్పటివరకూ 38 కోట్లకు పైగా టీకా డోసులను పంపిణీ చేసింది. నిన్న 40,68,862 మంది టీకా వేయించుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular