ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీలో స్వల్ప భూకంపం వచ్చింది. సోమవారం తెల్లవారుజామున 1.50 గంటలకు భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై 3.1గా నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ తెలిపింది. ఉత్తరకాశీకి 24 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్ర ఉన్నదని వెల్లడించింది. భూ అంతర్భాగంలో 5 కిలోమీటర్ల లోతులు కదలికలు సంభవించాయని చెప్పింది. కాగా, అర్ధరాత్రి వేళ భూమి కంపించడంతో ఇండ్లలో నిద్రపోతున్న జనం బయటకు పరుగులు తీశారు.