Sunday, November 24, 2024
HomeTrending Newsఉత్తరప్రదేశ్‌లోకి భారత్‌ జోడో యాత్ర

ఉత్తరప్రదేశ్‌లోకి భారత్‌ జోడో యాత్ర

కాంగ్రెస్ నాయకుడు రాహుల్‌గాంధీ చేపట్టిన భారత్‌ జోడో యాత్ర ఢిల్లీలో ఉత్సాహంగా సాగుతోంది. కొత్త సంవత్సరం నేపథ్యంలో 9 రోజుల విరామం తర్వాత రాహుల్ ఈ రోజు తిరిగి ప్రారంభించారు. ఈ రోజు యాత్రలో కాంగ్రెస్ సీనియర్ నేత అంబిక సోని, కేసి వేణుగోపాల్, ఎంపి గౌరవ్ గోగోయి తో పాటు శివసేన ఎంపి ప్రియాంక చతుర్వేది పాల్గొన్నారు.

మరోవైపు భారత్ జోడో యాత్ర ఇవాళ ఉత్తరప్రదేశ్‌లోకి ప్రవేశించనుంది. బీజేపీ పాలనకు వ్యతిరేకంగా దేశ ప్రజలను ఏకం చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ రాహుల్‌గాంధీ నేతృత్వంలో భారత్‌ జోడో యాత్ర ప్రారంభించింది. గత ఏడాది సెప్టెంబర్‌ 7న తమిళనాడులోని కన్యాకుమారిలో ప్రారంభమైన ఈ యాత్ర కశ్మీర్‌లో ముగియనుంది.

ఇప్పటివరకు తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌ రాష్ట్రాల్లో రాహుల్‌ భారత్‌ జోడో యాత్ర పూర్తయ్యింది. ఇవాళ ఢిల్లీలో యాత్ర ముగించుకుని రాహుల్‌గాంధీ ఉత్తరప్రదేశ్‌లో ప్రవేశించనున్నారు. ఢిల్లీ నుంచి ఘజియాబాద్‌లోని… లోని ప్రాంతం మీదుగా రాహుల్‌ పాదయాత్ర యూపీలోకి వెళ్లనుంది.

రాహుల్‌ రాక కోసం సిద్ధమవుతున్న కార్యకర్తల సందడితో రోడ్లన్నీ నిండిపోయాయి. ఘజియాబాద్‌లోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్‌ జామ్‌ అయ్యింది. పట్టణంలో ఎటుచూసినా కాంగ్రెస్‌ జెండాలే దర్శనమిస్తున్నాయి. ఇవాళ ఢిల్లీలో యాత్ర పునఃప్రారంభానికి ముందు రాహుల్‌గాంధీ మర్‌ఘాట్‌ హనుమాన్‌ మందిర్‌ను దర్శించుకుని, పూజలు చేశారు.

యూపీలోని మావి కలాన్, సిసానా, సిరూర్‌పూర్‌ గుండా భారత్ జోడో యాత్ర సాగనుంది. కైరానాతో పాటు షామ్లిలోని కొన్ని ప్రాంతాల్లో కూడా జరిగనుంది. యూపీ తర్వాత ఈనెల 5వ తేదీన హర్యానాలో భారత్ జోడో యాత్ర ప్రవేశిస్తోంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్