Thursday, April 25, 2024
HomeTrending Newsరాత పరీక్ష కోసం ఇస్లామాబాద్‌ కు పోటెత్తిన నిరుద్యోగులు

రాత పరీక్ష కోసం ఇస్లామాబాద్‌ కు పోటెత్తిన నిరుద్యోగులు

క్రికెట్‌ మ్యాచ్‌, ఫుట్‌బాల్‌, సాకర్‌ మ్యాచ్‌లు జరిగినప్పుడు స్టేడియం కిక్కిరి ఉండటం ఇప్పటి వరకు మనం చూశాం. మ్యాచ్‌ను లైవ్‌లో వీక్షించేందుకు అభిమానులు తరలివస్తుంటారు. దీంతో ఆయా స్టేడియాలు కిక్కిరిపోతుంటాయి. అయితే పాకిస్థాన్‌లో మాత్రం ఓ స్టేడియం ఉద్యోగ రాత పరీక్షకోసం వచ్చిన యువతీ యువకులతో నిండిపోయింది. పాకిస్తాన్ లో అంతకంతకు పెరిగిపోతున్న నిరుద్యోగానికి నిలువెత్తు నిదర్శనమని విపక్షాలు విమర్శిస్తున్నాయి.

ఇస్లామాబాద్‌ పోలీసు కానిస్టేబుల్‌ విభాగంలోని పోస్టులను గత ఐదేండ్ల నుంచి భర్తీ చేయకుండా అలానే ఉంచారు. దాదాపు 1600కు పైగా ఖాళీలను భర్తీ చేసేందుకు అక్కడి ప్రభుత్వం ఇటీవల పరీక్షలు నిర్వహించింది. ఈ పరీక్షలను ఇస్లామాబాద్‌లోని ఓ స్టేడియంలో నిర్వహించగా.. పరీక్ష రాసేందుకు అభ్యర్థులు వెల్లువెత్తారు. దాదాపు 30వేల మందికిపైగా అభ్యర్థులు తరలిరావడంతో మైదానం నిండిపోయింది. వీరంతా పరీక్ష రాసేందుకు వచ్చారా..? లేక మ్యాచ్‌ వీక్షించేందుకు వచ్చారా..? అన్నట్లు స్టేడియం పరిసరాలన్నీ కనిపించాయి. ఇందుకు సంబంధించిన దృష్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి.
RELATED ARTICLES

Most Popular

న్యూస్