పురుషుల వరల్డ్ కప్ హాకీ -2023లో నేడు భువనేశ్వర్ కళింగ స్టేడియంలో పూల్ ‘బి’ జట్ల మధ్య నేడు జరిగిన రెండో మ్యాచ్ లో నెదర్లాండ్స్ రికార్డు విజయం సాధించింది. చిలీపై 14-0తో ఏకపక్షంగా గెలుపొంది సూపర్ 8కు చేరుకుంది. మొదటి మ్యాచ్ లో న్యూ జిలాండ్ పై మలేషియా 3-2తో గెలుపొంది క్వార్టర్స్ లోకి అడుగుపెట్టింది.
7, 23, 24, 26, 30, 34, 35, 38, 41, 43, 45,46, 49, 59 నిమిషాల్లో గోల్స్ చేసింది. వీటిలో ఎనిమిది ఫీల్డ్ గోల్స్. ఆరు పేనాల్టీ కార్నర్స్ ఉన్నాయి.
నాలుగు గోల్స్ చేసిన జిప్ జాన్సేన్ కు ప్లేయర్ అఫ్ ద మ్యాచ్ దక్కింది.
తొలి మ్యాచ్ లో… మలేషియా 9వ నిమిషం వద్ద ఫీల్డ్ గోల్ చేసి స్కోరు బోణీ చేసింది. 43వ నిమిషం వద్ద పేనాల్టీ కార్నర్ గోల్ సాధించి స్కోరును 2-0ఆధిక్యానికి తీసుకెళ్ళింది. చివరి పావుభాగంలో కివీస్ జట్టు తేరుకొని విజయం కోసం హోరాహోరీ తలపడింది. 52,53 నిమిషాల్లో రెండు గోల్స్ సాధించి స్కోరును సమం చేసింది. అయితే ఆట మరో మూడు నిమిషాల్లో ముగిసే సమయంలో మలేషియా ఆటగాడు సారీ ఫైజల్ మెరుపు ఫీల్డ్ గోల్ తో ఆ జట్టు విజయం సొంతం చేసుకుంది.
కెప్టెన్ మర్హాన్ జలీల్ ‘ప్లేయర్ అఫ్ ద మ్యాచ్’ అందుకున్నాడు.