Friday, June 12, 2026
HomeTrending Newsసిఎంను కలిసిన ఉద్యోగ సంఘాల నేతలు

సిఎంను కలిసిన ఉద్యోగ సంఘాల నేతలు

ఏపీఎన్జీవోస్‌ అసోసియేషన్‌ నూతన అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన బండి శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి కే.వి. శివారెడ్డి, పలువురు ప్యానల్‌ సభ్యులు నేడు తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలుసుకున్నారు. నిన్న జరిగిన ఎన్నికల్లో బండి శ్రీనివాసరావు ప్యానల్ ఏకగ్రీవంగా ఎన్నికైంది. నూతన కమిటీకి సిఎం జగన్ శుభాకాంక్షలు తెలియజేశారు.

ఏపీఎన్జీవోస్‌ అసోసియేషన్‌ నూతన కార్యవర్గ సభ్యులు పి. పురుషోత్తం నాయుడు, డి.వి.రమణ, పి.కృష్ణ, సీహెచ్‌.శ్రీనివాసరావు, ప్రభుత్వ సలహాదారు (ఉద్యోగుల సంక్షేమం) ఎన్‌.చంద్రశేఖర్‌ రెడ్డి తదితరులు ముఖ్యమంత్రిని కలిసిన వారిలో ఉన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular