ముస్లింలు అనుసరించే బహు భార్యత్వం, ‘నిఖా హలాలా’ పద్ధతుల రాజ్యాంగ చెల్లుబాటుపై దాఖలైన పిటిషన్లను విచారించడానికి అయిదుగురు జడ్జీలతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటు చేస్తున్నట్లు సుప్రీంకోర్టు శుక్రవారం వెల్లడించింది. గతంలో ఉన్న రాజ్యాంగ ధర్మాసనంలో ఇద్దరు జడ్జీలు పదవీ విరమణ చేయడంతో కొత్త ధర్మాసనాన్ని ఏర్పాటు చేయనున్నట్లు కోర్టు తెలిపింది. అశ్విని ఉపాధ్యాయ్ అనే న్యాయవాది సుప్రీంకోర్టులో ఈ పిల్ వేశారు.