Friday, March 6, 2026
Homeజాతీయంఆక్సిజన్ అందక 24 మంది మృతి

ఆక్సిజన్ అందక 24 మంది మృతి

దేశంలో కరోనా భీభత్సం కొనసాగుతోంది. ఆక్సిజన్ సరఫరాలో జాప్యం కారణంగా కర్ణాటక, చామరాజనగర్ లోని ఓ ఆస్పత్రిలో 24 మంది మరణించారు.  నిన్న ఆదివారం ఉదయం నుంచి నేడు సోమవారం ఉదయం వరకూ ఈ మరణాలు సంభవించాయి.   ముఖ్యమంత్రి బి. ఎస్. యడ్యూరప్ప చామరాజనగర్ డిప్యూటి కమిషనర్ తో ఫోన్లో మాట్లాడి ఈ సంఘటన గురించి ఆరా తీశారు.

ముఖ్యమంత్రి సూచన మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖా మంత్రి సుధాకర్, ప్రాథమిక విద్యా శాఖా మంత్రి సురేష్ కుమార్ హుటాహుటిన చామరాజనగర్ చేరుకొని పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. ఇతర ప్రాంతాలనుండి ఆక్సిజన్ సిలిండర్లు తెప్పించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular