ప్రపంచ నాగరికతకు ఎంతో ప్రసిద్ధి రోమ్ నగరం. రోమ్ నగరంలో ఫామ్ ట్రీకి ఎంతో ప్రాముఖ్యత ఉందన్నారు రాష్ట్ర ప్రొహిబిషన్ & ఎక్సైజ్, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక, వారసత్వ, యువజన సర్వీసుల శాఖల మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్. ఇటలీ దేశానికి చెందిన ప్రముఖ రచయిత కార్ల్ ఫ్రైడ్రిచ్ ఫిలిప్ ఓన్ మారిషస్ (1794 – 1868) తన 23వ ఏట నుండి ఇటలీలోని మ్యూనిచ్ నగరంలో వారి పర్యవేక్షణలో పామ్ జాతికి చెందిన చెట్లను (1823 – 1850 మధ్యకాలంలో) పెంచడం జరిగిందన్నారు. ఈ ఫామ్ టీ జాతి చెట్లు ఇప్పటికీ మనుగడ సాధిస్తున్నాయి. వారు రచించిన బుక్ ఆఫ్ ఫామ్ పుస్తకంలో అనేక అంశాలను ప్రస్తావించారన్నారు మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్.
ఫామ్ ట్రీ చెట్ల లో ముఖ్యమైనవి 5 రకాలు:-
1, కొబ్బరి చెట్టు ,
2,ఖర్జూర చెట్టు ,
3,ఈత చెట్టు,
4, తాటి చెట్టు ,
5,ఆయిల్ ఫామ్ చెట్లు
వీటితోపాటు వివిధ రకాల చెట్లు ఫామ్ ట్రీ జాతికి చెందినవిగా ఇటలీకి చెందిన రచయిత తన పుస్తకంలో వెల్లడించారు.
ఈ ఫామ్ ట్రీ చెట్లు అన్ని ప్రాంతాలలో అన్ని రకాల వాతావరణ పరిస్థితులను తట్టుకుని నిలబడతాయని తన పుస్తకంలో పరిశోధన రూపంగా వివరించారన్నారు మంత్రి డా.V. శ్రీనివాస్ గౌడ్. బుక్ ఆఫ్ పామ్ పుస్తకాన్ని ప్రముఖ బొటానికల్ శాస్త్రవేత్త లివింగ్ లెజెండ్ ప్రొఫెసర్. డా. హాన్స్ వాల్టర్ లాక్ (ప్రస్తుతం బెర్లిన్ లోని FREIE UNIVERSITY లో బొటానికల్ గార్డెన్ అండ్ బొటానికల్ మ్యూజియం లో ప్రొఫెసర్ అండ్ డిపార్ట్మెంట్లో విశేష సేవలు అందిస్తున్నారు).బుక్ ఆఫ్ పామ్ పై పరిశోధనలు చేసి పామ్ ట్రీ ఎంతో విలువైనదిగా గుర్తించారు. బొటానికల్ సైన్స్ లో ఎన్నో పరిశోధనలు చేసి ఫామ్ ట్రీ గొప్పదనాన్ని 3 విలువైన వాల్యూమ్స్ ను ప్రచురించారన్నారు.
రాష్ట్ర ప్రొహిబిషన్ & ఎక్సైజ్ క్రీడా పర్యాటక సాంస్కృతిక పురావస్తు యువజన సర్వీసుల శాఖ మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ ఇటీవల స్పెయిన్ లో జరిగిన ఇంటర్నేషనల్ టూరిజం ఫెయిర్ ( FITUR) లో పాల్గొన్న అనంతరం టూరిజం ప్రాంతాలను అధ్యయనం చేయడానికి రోమ్ ను సందర్శించారు. రోమ్ లో జరిగిన కార్యక్రమంలో మంత్రి డా. V. శ్రీనివాస్ గౌడ్ కి ‘బుక్ ఆఫ్ పామ్’ పబ్లిషర్ తరపున ప్రతినిధులు ఈ పుస్తకాన్ని అందించారు. ఈ బుక్ ఆఫ్ పామ్ పుస్తకాన్ని మంత్రి స్వయంగా అధ్యయనం చేసారు.
ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర ప్రొహిబిషన్ & ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో సుమారు 3.75 కోట్ల ఈత, తాటి మొక్కలను నాటడం జరిగిందన్నారు మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్.
ఈత, తాటి చెట్ల నుండి నీరా మరియు బెల్లం, తేన, సిరప్ లను తయారు చేయడం జరుగుతుందన్నారు. తాటి, ఈత చెట్లతోపాటు ఖర్జూర, కొబ్బరి, జీలుగా చెట్ల నుండి నీరాను ఉత్పత్తి చేయడానికి కృషి చేస్తున్నామన్నారు. నీరా అనేది ఆల్కహాల్ రహిత పానీయంగా ఉత్పత్తి చేస్తున్నామన్నారు. నీరా నుండి వచ్చే బై ప్రోడక్ట్ లు కూడా ఆల్కహాల్ రహితంగా ఉండేలా ఉత్పత్తి చేస్తున్నామన్నారు. నీరాలో (మినరల్స్) పోషక విలువలు సమృద్ధిగా లభ్యమవుతాయన్నారు. నీరాలో ఉండే సూక్ష్మజీవులు ఉత్పత్తి చేసే కారకాల వల్ల మూత్రపిండాల్లో రాళ్లు రాకుండా…, వచ్చిన రాళ్లను కరిగించే విధంగా రోగ నిరోధక శక్తిగా పనిచేస్తుందనీ పలు పరిశోధనలో వెల్లడైందన్నారు మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్.
నీరా లో ఉండే సూక్ష్మజీవులు ఉత్పత్తి చేసే కారకాల వల్ల క్యాన్సర్ నిరోధకంగాను పనిచేస్తాయని పలు పరిశోధనలో వెల్లడైందని తెలిపారు. నీరా ఆరోగ్యప్రదాయిని తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అందించాలనే శుభసంకల్పంతో హైదరాబాద్ ప్రధాన నగరంలో నీరా కేఫ్ ను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.