Friday, June 12, 2026
Homeసినిమావిజయ్ ఫ్యాన్స్ కి సారీ చెప్పిన సమంత

విజయ్ ఫ్యాన్స్ కి సారీ చెప్పిన సమంత

విజయ్, సమంత కాంబినేషన్లో ‘ఖుషి‘ అనే సినిమా రూపొందుతోంది. ఈ చిత్రానికి శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని డిసెంబర్ 23న రిలీజ్ చేయాలి అనుకున్నారు కానీ.. కుదరలేదు. ఆతర్వాత ఫిబ్రవరి 10న విడుదల చేయాలి అనుకున్నారు కానీ.. ఇప్పుడు కూడా కుదరలేదు. కారణం ఏంటంటే.. సమంత మయో సైటిస్ వ్యాధితో బాధపడుతుండడం వలన షూటింగ్ కి బ్రేక్ పడింది. ఇలా ఖుషి మూవీ ఆగిపోవడంతో విజయ్, గౌతమ్ తిన్ననూరితో సినిమా స్టార్ట్ చేయాలి అనుకుంటున్నాడు.

ఇక సమంత ఈ వ్యాధి నుంచి బయటపడింది కానీ.. ఖుషి షూటింగ్ చేయడానికి డేట్స్ ఇవ్వకుండా ముంబాయి వెళ్లి వెబ్ సిరీస్ చేయడానికి రెడీ అవుతుందని టాక్ వినిపిస్తోంది. దీంతో ఆగిపోయిందని ప్రచారం ఊపందుకుంది. డైరెక్టర్ శివ నిర్వాణ సోషల్ మీడియా ద్వారా ఖుషి షూటింగ్ త్వరలో స్టార్ట్ కానుందని తెలియచేశాడు. అయితే.. విజయ్ ఫ్యాన్ సమంతను సోషల్ మీడియా ద్వారా ఖుషి షూటింగ్ ఎప్పుడు..? అని అడిగాడు. దీనికి సమంత స్పందించింది. విజయ్ ఫ్యాన్స్ కు అపొలజీస్ చెబుతున్నాను. త్వరలోనే ఖుషి షూటింగ్ స్టార్ట్ చేస్తాను అని చెప్పింది. ఇలా.. సమంత విజయ్ అభిమానికి క్షమపణలు చెప్పడం.. సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular