పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ఈ రోజు నుంచి ప్రారంభం అయ్యాయి. నేటి నుంచి 19 రోజుల పాటు అంటే ఆగస్టు 13 వరకు సమావేశాలు కొనసాగుతాయి. ఉభయ సభలూ కరోనాకు పూర్వం ఉన్న వేళల ప్రకారమే ఉదయం 11గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఏకకాలంలో పనిచేస్తాయి. మొత్తం 17 కొత్త బిల్లులను ఆమోదం కోసం ప్రవేశపెడతారు.