Monday, February 24, 2025
Homeస్పోర్ట్స్Asia Mixed Team C’ships 2023: సెమీస్ కు ఇండియా

Asia Mixed Team C’ships 2023: సెమీస్ కు ఇండియా

బ్యాడ్మింటన్ ఆసియా మిక్స్డ్  టీం ఛాంపియన్ షిప్ లో ఇండియా సెమీ ఫైనల్స్ కు చేరుకుంది. నేడు జరిగిన క్వార్టర్ ఫైనల్స్ లో హాంగ్ కాంగ్ పై 3-2 తేడాతో అద్భుత విజయం సాధించారు. ఐదు మ్యాచ్ ల్లో మొదటి రెండూ ఓటమి పాలైనా ఆ తర్వాత వరుసగా మూడు మ్యాచ్ ల్లో రాణించి గేమ్ ను నిలబెట్టి సెమీస్ కు దూసుకెళ్ళారు.  పరాజయం పాలై టోర్నీ నుంచి నిష్క్రమించింది.

తొలుత జరిగిన మిక్స్డ్ డబుల్స్ లో ఇషాన్ భట్నాగర్- తానీషా క్రాస్టో జోడీపై 26-24; 21-17 తేడాతో లీ-యాంగ్ జోడీ విజయం సాధించింది.

రెండో మ్యాచ్ పురుషుల సింగిల్స్ లో లక్ష్య సేన్ పై అంగస్ 20-22; 21-19;21-18 తో గెలుపొందాడు.

మూడో మ్యాచ్ పురుషుల డబుల్స్ లో చిరాగ్ శెట్టి- ధృవ్ కపిల ద్వయం 20-22తో తొలి సెట్ కోల్పోయారు, ఆ తర్వాత  ధీటుగా ఆడి 21-19; 21-11తో  విజయం దక్కించుకున్నారు.

నాలుగో మ్యాచ్ మహిళల సింగిల్స్ లో పివి సింధు 16-21 తో సలోని మేహతాపై తొలి సెట్ కోల్పోయినా ఆ తర్వాత తనదైన శైలిలో ఆటపై పట్టు సాధించి21-7;21-9తో విజయం సొంతం చేసుకుంది.

చివరిది, నిర్ణాయకమైన చివరి మ్యాచ్ మహిళల డబుల్స్ లో గాయత్రి గోపీ చంద్-త్రెసా జాలీ లు 21-13; 21-12తో విజయం సాధించి సెమీస్ బెర్త్ ఖాయం చేశారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్