3.5 C
New York
Monday, December 11, 2023

Buy now

Homeస్పోర్ట్స్Women’s T20 WC: బంగ్లాపై కివీస్ విజయం

Women’s T20 WC: బంగ్లాపై కివీస్ విజయం

మహిళల టి20 వరల్డ్ కప్ లో నేడు జరిగిన తొలి మ్యాచ్ లో బంగ్లాదేశ్ పై న్యూజిలాండ్ 71 పరుగులతో ఘన విజయం సాధించింది. కేప్ టౌన్ లోని న్యూ లాండ్స్ మైదానంలో జరిగిన మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కివీస్ లో…. సుజీ బేట్స్ 61 బంతుల్లో 7 ఫోర్లు,1 సిక్సర్ తో 81 (నాటౌట్); మరో ఓపెనర్ బెర్నాడిన్ 44 (26 బంతులు; 5 ఫోర్లు); మడ్డీ గ్రీన్ 44 (20 బంతులు; 7 ఫోర్లు)… రాణించడంతో  ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది.

లక్ష్య సాధనలో బంగ్లాదేశ్ విఫలమై 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 1118 పరుగులే చేయగలిగింది. మున్షీదా ఖాతూన్-30; షోర్నా అక్తర్ -31 మాత్రమే రాణించారు. కివీస్ బౌలర్లలో ఈడెన్ కార్సన్ 3; హన్నా రో 2; తాహిహు, అమేలియా కెర్ర్ చెరో వికెట్ పడగొట్టారు.

సుజీ బేట్స్ కు ప్లేయర్ అఫ్ ద మ్యాచ్ దక్కింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్