ఢిల్లీ టెస్టులో ఇండియా తొలి ఇన్నింగ్స్ లో 262 పరుగులకు ఆలౌట్ అయ్యింది. మొదటి ఇన్నింగ్స్ లో ఆసీస్ కు కేవలం ఒక పరుగు ఆధిక్యం లభించింది. వికెట్ నష్టపోకుండా 21 పరుగులతో రెండోరోజు ఆట మొదలు పెట్టిన ఇండియా 46వద్ద తొలి వికెట్ కెఎల్ రాహుల్ (16) కోల్పోయింది. ఆస్ట్రేలియా స్పిన్నర్ నాథన్ లియాన్ దెబ్బకు భారత బ్యాటర్లు పెవిలియన్ కు క్యూ కట్టారు. 66 పరుగులకు మరో మూడు వికెట్లు పడ్డాయి. రోహిత్ శర్మ 32; అయ్యర్ 4 రన్స్ చేసి అవుట్ కాగా, వందో టెస్టు ఆడుతున్న పుజారా నిరాశపరిచి డకౌట్ అయ్యాడు.
ఈ దశలో విరాట్ కోహ్లీ-రవీంద్ర జడేజా ఐదో వికెట్ కు 79 పరుగుల పార్టనర్ షిప్ సాధించారు. జడేజా-26; కోహ్లీ-44 పరుగులు చేసి ఔటయ్యారు. శ్రీకర్ భరత్ కేవలం 6 పరుగులే చేసి విఫలమయ్యాడు. ఈ దశలో అక్షర్ పటేల్-రవిచంద్రన్ అశ్విన్ లు ఎనిమిదో వికెట్ కు 114 పరుగులు చేసి ఇన్నింగ్స్ చక్కదిద్దారు. అశ్విన్-37; అక్షర్-74 పరుగులు చేసి ఔటయ్యారు. షమి రెండు పరుగులకు ఔటయ్యాడు. ఆసీస్ బౌలర్లలో నాథన్ లియాన్ 5; కున్నేమాన్, మర్ఫీ చెరో రెండు; కమ్మిన్స్ ఒక వికెట్ పడగొట్టారు.
రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్ లో ఒక వికెట్ కోల్పోయి 61 పరుగులు చేసింది. ఖవాజా 6 పరుగులు చేసి జడేజా బౌలింగ్ లో శ్రేయాస్ అయ్యర్ కు క్యాచ్ ఇచ్చి ఔట్ కాగా, ట్రావిస్ హెడ్-39; లబుషేన్-16 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఆసీస్ 62 పరుగుల ఆధిక్యంలో ఉంది.
Also Read : Ind Vs Aus: ఆస్ట్రేలియా 263 ఆలౌట్