8.8 C
New York
Sunday, December 10, 2023

Buy now

Homeస్పోర్ట్స్ Ranji Trophy Finals:  సౌరాష్ట్ర పైచేయి

 Ranji Trophy Finals:  సౌరాష్ట్ర పైచేయి

రంజీ ట్రోఫీ ఫైనల్స్ లో సౌరాష్ట్ర విజయం దిశగా సాగుతోంది.  విజయానికి మరో ఆరు వికెట్ల దూరంలో నిలిచింది. తొలి ఇన్నింగ్స్ లో ఐదు వికెట్లకు 317 పరుగుల వద్ద నేడు మూడో రోజు ఆట మొదలు పెట్టిన సౌరాష్ట్ర 404 పరుగులకు ఆలౌట్ అయ్యింది. అర్పిత్ వసవాడ-81; చిరాగ్ జానీ-60; షెల్డాన్ జాక్సన్ -59; ప్రేరక్ మన్కడ్- 33; డిఏ జడేజా-29; విస్వరాజ్ జడేజా-25 పరుగులతో రాణించారు. బెంగాల్ బౌలర్లలో ముఖేష్ కుమార్ 4; ఆకాష్ దీప్; ఇషాన్ పోరెల్ చెరో 3 వికెట్లు పడగొట్టారు.

230 పరుగులు వెనకబడి రెండో ఇన్నింగ్స్ మొదలు పెట్టిన బెంగాల్ నేడు మూడోరోజు ఆట ముగిసే సమయానికి 4 వికెట్లు కోల్పోయి 169 పరుగులు చేసింది.  అనుష్టుప్ మజుందార్ 61 రన్స్ చేసి ఔట్ కాగా, మనోజ్ తివారీ-57; షాబాజ్ అహ్మద్ -13 పరుగులతో క్రీజులో ఉన్నారు.  ప్రస్తుతానికి ఇంకా  61 పరుగులు బెంగాల్ వెనకబడి ఉంది.

సౌరాష్ట్ర బౌలర్లు జయదేవ్ ఉనాడ్కత్, చేతన్ సకారియా చెరో రెండు వికెట్లు పడగొట్టారు.

Also Read : Ranji Trophy: ఫైనల్స్ కు సౌరాష్ట్ర, బెంగాల్

RELATED ARTICLES

Most Popular

న్యూస్