Friday, June 12, 2026
Homeసినిమా'వీరమల్లు'కు మోక్షం ఎప్పుడో?

‘వీరమల్లు’కు మోక్షం ఎప్పుడో?

పవన్ కళ్యాణ్, ఆయన మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కాంబినేషన్ లో ‘వినోదాయ సీతం’ రీమేక్ ను నిన్న లాంఛనంగా ప్రారంభించారు.  సముద్రఖని దర్శకత్వం హహిస్తోన్న ఈ సినిమాను  పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తోంది. ఈ మూవీ కోసం పవన్ ఓ ఇరవై రోజులు డేట్స్ ఇచ్చారట.

అయితే పవన్ ఎప్పుడో మొదలు పెట్టిన ‘హరి హర వీరమల్లు’ సినిమా ఇంకా నిర్మాణంలోనే ఉంది.  విభిన్న కథా చిత్రాల దర్శకుడు క్రిష్‌ రూపొందిస్తోన్న ఈ సినిమా ఏ ముహుర్తాన స్టార్ట్ చేశారో కానీ.. గత కొన్ని సంవత్సరాలుగా షూటింగ్ జరుగుతూనే ఉంది. ఎప్పుడు పూర్తవుతుందో తెలియని పరిస్థితి. ఇప్పటి వరకు ఈ సినిమా సగం మాత్రమే పూర్తయ్యింది. ఇదిలా ఉంటే.. వీరమల్లు పూర్తి కాకుండానే.. పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ డైరెక్షన్ లో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాను స్టార్ట్ చేశారు. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తుంది. పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు కానీ.. షూటింగ్ ఎప్పుడు మొదలువుతుందనేది తెలియదు. అలాగే సాహో డైరెక్టర్ సుజిత్ తో ‘ఓజీ’ అనే సినిమాను ప్రారంభించారు. ఓజీ అంటే ఓరిజినల్ గ్యాంగ్ స్టర్. ఈ మూవీని ఆర్ఆర్ఆర్ ప్రొడ్యూసర్ డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. ఈ మూవీ కూడా పూజా కార్యక్రమాలతో ప్రారంభం అయ్యింది కానీ.. ఎప్పుడు సెట్స్ పైకి వస్తుందో క్లారిటీ లేదు. ఇప్పుడు వినోదయ సీతం రీమేక్ మూవీని స్టార్ట్ చేశారు.

ఇదంతా చూస్తుంటే… పాపం క్రిష్‌ అనిపిస్తుంటుంది. ఎందుకంటే.. వీరమల్లు చిత్రాన్ని గత కొన్ని సంవత్సరాలుగా షూటింగ్ చేస్తూనే ఉన్నారు. ఇది పూర్తవదు.. ఇంకో సినిమాను స్టార్ట్ చేయలేడు. ఈ సినిమా లేకపోతే క్రిష్‌ ఇప్పటికి ఓ మూడు సినిమాలు పూర్తి చేసేవాడు. ఈవిధంగా ఆర్థికంగా నష్టం. ఎప్పుడు పూర్తవుతుందో.. ఎలాంటి రిజెల్ట్ వస్తుందో అనే టెన్షన్. సమ్మర్ కి రిలీజ్ చేయాలి అనుకున్నారు కానీ.. కుదరడం లేదు. దసరాకి రిలీజ్ అనుకుంటున్నారు కానీ.. అది కూడా డౌటే. మరి.. వీరమల్లు ఎప్పటికి పూర్తవుతుందో..? ఎప్పుడు థియేటర్లోకి వస్తుందో..?

Also Read : పవన్, సురేందర్ రెడ్డి మూవీ ఏమైంది..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular