Friday, June 12, 2026
HomeTrending Newsదేశవ్యాప్తంగా 240 రైళ్ల రద్దు

దేశవ్యాప్తంగా 240 రైళ్ల రద్దు

గతకొంతకాలంగా భారతీయ రైల్వే వివిధ కారణాలతో ప్రతిరోజూ వందల సంఖ్యలో రైళ్లను రద్దుచేస్తూ వస్తున్నది. ఇందులో భాగంగా శుక్రవారం కూడా దేశవ్యాప్తంగా 240 రైళ్లను రద్దుచేసింది. మెయింటేనెన్స్‌, మౌలిక సదుపాయాల కల్పన, భద్రతా కారణాల దృష్ట్యా మార్చి 3న నడవాల్సిన 240కిపైగా రైళ్లను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. నేడు బయలుదేరాల్సిన మరో 87 రైళ్లను పాక్షికంగా రద్దుచేస్తున్నట్లు తెలిపారు. ఇందులో కాన్పూర్‌, అసన్‌సోల్‌, ఢిల్లీ, లక్నో, బొకారో స్టీల్‌ సిటీ, బక్సర్‌, అమరావతి, వాద్రా, నాగ్‌పూర్‌, పుణె, పఠాన్‌కోట్‌, మదురై, రామేశ్వరంతోపాటు మరికొన్ని ప్రాంతాలకు వెళ్లాల్సిన రైళ్లు ఉన్నాయి. రైళ్లు రద్దయిన నేపథ్యంలో ప్రయాణికులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు. ఆయా రైళ్లలో ముందుగానే టికెట్‌ బుక్‌చేసుకున్నవారికి డబ్బులు తిరిగి చెల్లిస్తామని వెల్లడించారు. అయితే తాము వెళ్లాల్సిన రైలు.. రద్దయిన వాటి జాబితాలో ఉందో లేదో ఒక చెక్‌చేసుకోవాలని చెప్పారు.

బుధవారం కూడా దేశవ్యాప్తంగా 250కిపైగా రైళ్లను అధికారులు రద్దుచేసిన విషయం తెలిసిందే. వీటితోపాటు మరో 96 రైళ్లను నిలిపివేశారు. దీంతో మొత్తంగా 351 రైళ్లు రద్దయినట్లయింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular