రజినీకాంత్ 170వ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చేసింది. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై సుభాస్కరన్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. దర్శకుడు టి.జె.జ్ఞానవేల్ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. నిర్మాత సుభాస్కరన్ పుట్టినరోజు సందర్భంగా ‘తలైవర్ 170’వ సినిమాని అనౌన్స్ చేశారు. ఈ మేరకు వారు ‘ సుభాస్కరన్ పుట్టినరోజు సందర్భంగా రజినీకాంత్ తలైవర్ 170వ సినిమాను మా బ్యానర్లో రూపొందించబోతున్నట్లు ప్రకటించటం ఆనందంగా ఉంది. టి.జె.జ్ఞానవేల్ ఈ సినిమాను డైరెక్ట్ చేయబోతున్నారు. అనిరుద్ రవిచంద్రన్ సంగీతాన్ని అందించనున్నారు.
జి.కె.ఎం. తమిళ్ కుమరన్ నేతృత్వంలో త్వరలోనే ఈ సినిమా షూటింగ్‌ను ప్రారంభించనున్నారు. అలాగే 2024లో ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ‘‘తలైవర్ గారితో లైకా ప్రొడక్షన్స్ సంస్థకు ఉన్న అనుబంధం అందరికీ తెలిసిందే. ఆయనతో కలిసి ఎన్నో విజయవంతమైన చిత్రాలను రూపొందించాం. ఆయనతో ఉన్న అనుబంధం ఇలా కొనసాగటాన్ని ఎంతో గౌరవంగా భావిస్తున్నామని తెలియేశారు మేకర్స్. ఫ్యాన్స్, ప్రేక్షకులు సంతోషపడేలా ఎన్నో గొప్పగా ఈ సినిమాను రూపొందించటానికి అందరి ఆశీర్వాదాలు మాకు ఇవ్వండి’’ అంటూ నిర్మాణ సంస్థ ప్రకటించింది. సినిమాలో హీరోయిన్, ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనే తెలియజేస్తామని మేకర్స్ ఈ సందర్భంగా తెలియజేశారు.