విమెన్ ప్రీమియర్ లీగ్ లో యూపీ వారియర్స్ పై ఢిల్లీ 42 పరుగులతో ఘన విజయం సాధించింది. డా. డీవై పాటిల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో యూపీ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. తొలి వికెట్ (షఫాలీ వర్మ -17) కు ఢిల్లీ 67 పరుగులు చేసింది. కెప్టెన్ మెగ్ లన్నింగ్ 42 బంతుల్లో 10 ఫోర్లు 3 సిక్సర్లతో 70; జోనాస్సేన్ 20 బంతుల్లో 3ఫోర్లు, 3సిక్సర్లతో 42(నాటౌట్); జెమైమా రోడ్రిగ్యూస్ 22 బంతుల్లో 4 ఫోర్లతో 34(నాటౌట్); అలీస్ క్యాప్సీ-21 పరుగులతో రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 211 పరుగుల భారీ స్కోరు చేసింది.
యూపీ బౌలర్లలో షబ్నిం ఇస్మాయిల్, రాజేశ్వరి గాయక్వాడ్, తహిలా మెక్ గ్రాత్, ఎక్సెల్ స్టోన్ తలా ఒక వికెట్ పడగొట్టారు.
భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ 31 పరుగులకే మూడు వికెట్లు (అలేస్సా హీలీ-24; శ్వేతా షెరావత్-1; కిరణ్ నవ్ గిరే-2) కోల్పోయింది. దీప్తి శర్మ(12) విఫలం కాగా, దేవిక వైద్య (23) పర్వాలేదనిపించింది. జట్టులో తహీలా మెక్ గ్రాత్ 50 బంతుల్లో 11 ఫోర్లు, 4 సిక్సర్లతో 90 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచింది. 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 169 పరుగులు చేయగలిగింది. ]
ఢిల్లీ బౌలర్లలో జెస్ జోనస్సేన్ 3; మారిజాన్ కాప్, శిఖా పాండే చెరో వికెట్ పడగొట్టారు.
జోనాస్సేన్ కు ‘ప్లేయర్ అఫ్ ద మ్యాచ్’ దక్కింది’