Sunday, November 24, 2024
HomeTrending NewsSLBC Meeting: బ్యాంకర్లు మరింత సహకరించాలి: సిఎం విజ్ఞప్తి

SLBC Meeting: బ్యాంకర్లు మరింత సహకరించాలి: సిఎం విజ్ఞప్తి

సామాజిక – ఆర్థిక ప్రగతిలో విద్య, గృహ నిర్మాణం అత్యంత కీలకమని, ఈ రెండు రంగాల పట్ల బ్యాంకర్లు మరింత సానుకూల దృక్పథంతో, అనుకూల కార్యాచరణతో ముందడుగు వేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. గత ఏడాది ఈ రెండు రంగాలకు నిర్దేశించుకున్న లక్ష్యాల స్థాయి కన్నా తక్కువగా…. విద్యారంగానికి కేవలం 42.91శాతం, గృహనిర్మాణ రంగానికి 33.58 శాతం మాత్రమే రుణాలు ఇచ్చాయని అన్నారు.  222వ రాష్ట్ర స్ధాయి బ్యాంకర్ల కమిటీ సమావేశం సిఎం జగన్‌ అధ్యక్షతన  తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో జరిగింది.  2022–23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మొదటి 9 నెలల్లోనే వార్షిక రుణ ప్రణాళిక లక్ష్యాలకు మించి సాధించింది. ఇది 124.69%గా ఉందని చెప్పడానికి సంతోషకరంగా ఉందని సిఎం వ్యాఖ్యానించారు.

గత ఏడాది ఎంతమేర రుణ ప్రణాళిక లక్ష్యాను చేరుకున్నది ఎస్.ఎల్.బి.సి. వెల్లడించింది.

ప్రాథమిక రంగం:
లక్ష్యం:  రూ. 2,35,680 కోట్లు
ఇచ్చిన రుణాలు: రూ. 2,34,442 కోట్లు.
99.47శాతం

వ్యవసాయ రంగం:
లక్ష్యం:  రూ. 1,64,740 కోట్లు
ఇచ్చిన రుణాలు: 1,72,225 కోట్లు
104.54 శాతం

ఎంఎస్‌ఎంఈ రంగం:
లక్ష్యం : రూ. 50,100 కోట్లు
ఇచ్చిన రుణాలు: రూ. 53,149 కోట్లు
106.09 శాతం

ప్రాథమికేతర రంగం:
లక్ష్యం: రూ.83,800 కోట్లు
ఇచ్చిన రుణాలు: రూ. 1,63,903 కోట్లు
195.59శాతం (రెట్టింపు)

సిఎం బ్యాంకర్లకు పలు సూచనలు చేశారు..

  • గృహనిర్మాణ రంగంలో బ్యాంకులు మరింత ఊతమివ్వాల్సిన అవసరం ఉంది.
  • కౌలు రైతులకు బ్యాంకులు మరింత బాసటగా నిలవాలి
  • మహిళా స్వయంసహాయ సంఘాలకు ఇచ్చే రుణాలపై వడ్డీల విషయంలో బ్యాంకులు పునర్‌ పరిశీలన చేయాలి. మహిళలు దాచుకున్న డబ్బుపై కేవలం 4శాతం వడ్డీ ఇస్తున్నారు.
  • కాని వారికిచ్చే రుణాలపై మాత్రం అధిక వడ్డీలు వేస్తున్నారు. ఈ విషయంలో బ్యాంకులు తగిన పరిశీలన చేసి తక్కువ వడ్డీకే రుణాలు ఇచ్చేలా చూడాలి.
  • నైపుణ్యాభివృద్ధి యూనివర్శిటీని ఏర్పాటు చేస్తున్నాం. దీనికి బ్యాంకులు బాసటగా నిలవాలి.
  • ఎస్‌ఎల్బీసీ సమావేశాల్లో చర్చించుకున్న అంశాలన్నీ కూడా లాజికల్‌ ఎండ్‌కు రావాలి

అని సిఎం సూచించారు.

ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ కె ఎస్‌ జవహర్‌రెడ్డి, గ్రామవార్డు సచివాలయాల శాఖ స్పెషల్‌ సీఎస్‌ అజయ్‌ జైన్, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ స్పెషల్‌ సీఎస్‌ వై శ్రీలక్ష్మి,  ఆర్ధికశాఖ కార్యదర్శి కె వి వి సత్యనారాయణ,  మైనార్టీ సంక్షేమశాఖ కార్యదర్శి ఏ.ఎండి. ఇంతియాజ్, ఏపీ టిడ్కో ఎండీ సీహెచ్‌ శ్రీధర్, వ్యవసాయశాఖ కమిషనర్‌ సీహెచ్‌ హరికిరణ్, ఏపీఐఐసీ వీసీ అండ్‌ ఎండీ జి సృజన, ఇతర ఉన్నతాధికారులు,   ఎస్‌ఎల్‌బీసీ ప్రెసిడెంట్, యూనియన్‌ బ్యాంకు ఎండీ అండ్‌ సీఈఓ ఏ.మణిమేకలై, ఎస్‌ఎల్‌బీసీ కన్వీనర్‌ నవనీత్‌ కుమార్, నాబార్డు సీజీఎం ఎం ఆర్‌ గోపాల్, ఆర్‌బీఐ డీజీఎం ఏపీ,  వికాస్‌ జైస్వాల్, పలువురు బ్యాంకర్లు హాజరయ్యారు.

Also Read : అంబేద్కర్ విగ్రహ పనులపై సిఎం సమీక్ష

RELATED ARTICLES

Most Popular

న్యూస్