Monday, November 25, 2024
HomeTrending Newsవచ్చే వారం రష్యా- చైనా అధ్యక్షుల భేటి

వచ్చే వారం రష్యా- చైనా అధ్యక్షుల భేటి

రష్యా – ఉక్రెయిన్ యుద్ధం ఏడాదిగా సాగుతున్నా ఇప్పటివరకు కొలిక్కి రాలేదు. పశ్చిమ దేశాలు శాంతికి ప్రయత్నించక పోగా రష్యాను దోషిగా నిలబెట్టే కుటిల యత్నాలు చేస్తున్నాయి. అమెరికా, ఐరోపా దేశాల మాయలో పడ్డ ఉక్రెయిన్ అధ్యక్షుడు జేలేన్స్కీ  రష్యాతో తలపడేందుకే మొగ్గు చూపుతున్నారు. దీంతో ప్రపంచ దేశాలు తల పట్టుకుంటున్నాయి. ఆహార కొరత, ఆర్ధిక మాంద్యం ప్రపంచాన్ని వెంటాడుతున్నా అమెరికా.. నాటో దేశాలు రష్యాతో ప్రచ్చన్న యద్దానికే సిద్దమయ్యాయి.

ఈ నేపథ్యంలో చైనా అధ్య‌క్షుడు జీ జిన్‌పింగ్‌.. వ‌చ్చే వారం మాస్కోలో ర‌ష్యా అధ్య‌క్షుడు పుతిన్‌తో భేటీకానున్నారు. ఈ విష‌యాన్ని అధికారులు వెల్ల‌డించారు. ఆ భేటీలో స‌మ‌గ్ర‌మైన భాగ‌స్వామ్య‌, వ్యూహాత్మ‌క స‌హ‌కారం గురించి చ‌ర్చించ‌నున్న‌ట్లు ర‌ష్యా అధికారులు వెల్ల‌డించారు. ఉక్రెయిన్‌తో జ‌రుగుతున్న యుద్ధాన్ని ఆపేందుకు ప్ర‌య‌త్నిస్తున్న‌ట్లు ఇటీవ‌ల చైనా ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ఆ ఇద్ద‌రి భేటీకి ప్రాధాన్య‌త సంత‌రించుకున్న‌ది. కానీ ప‌శ్చాత్య దేశాలు మాత్రం చైనాపై ఆగ్ర‌హంగా ఉన్నాయి. డ్రాగ‌న్ దేశం.. ర‌ష్యాకు ఆయుధాల‌ను స‌ర‌ఫ‌రా చేస్తున్న‌ట్లు ఆరోపిస్తున్నాయి.

పుతిన్ ఆహ్వానం మేర‌కు.. మార్చి 20 నుంచి 22 వ‌ర‌కు జీ జిన్‌పింగ్ మాస్కోలో పర్య‌టిస్తార‌ని చైనా విదేశాంగ శాఖ అధికారులు తెలిపారు. ఇద్ద‌రు నేత‌లు ప‌లు ద్వైపాక్షిక డాక్యుమెంట్ల‌పై సంత‌కాలు చేయ‌నున్నారు. ఫ్రెండ్‌షిప్‌, పీస్ ఉద్దేశంతో ఆ ట్రిప్ సాగ‌నున్న‌ట్లు చైనా విదేశాంగ శాఖ పేర్కొన్న‌ది. జీ జిన్‌పింగ్‌ను తాను కూడా క‌ల‌వాల‌నుకుంటున్న‌ట్లు ఉక్రెయిన్ అధ్య‌క్షుడు జెలెన్‌స్కీ ఫిబ్ర‌వ‌రిలో ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే.
RELATED ARTICLES

Most Popular

న్యూస్