విశాఖపట్నం వన్డేలో ఇండియా దారుణ ఓటమి చవిచూసింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇండియా 26 ఓవర్లలో 117 పరుగులకే ఆలౌట్ కాగా ఈ లక్ష్యాన్ని ఆసీస్ వికెట్ నష్ట పోకుండా 11 ఓవర్లలోనే ఛేదించింది. ఆసీస్ పేసర్ మైఖేల్ స్టార్క్ ఇండియా టాపార్డర్ ను కకావికలం చేశాడు. మొత్తం ఐదు వికెట్లు తీసుకున్నాడు. అబ్బాట్ మూడు; నాథన్ ఎల్లిస్ రెండు వికెట్లతో సత్తా చాటారు.
టీమిండియాలో విరాట్ కోహ్లీ-31; అక్షర్ పటేల్-29; రవీంద్ర జడేజా-16; రోహిత్ శర్మ-13.. మాత్రమే డబుల్ డిజిట్ స్కోరు చేశారు. శుభ్ మన్ గిల్, సూర్య కుమార్ యాదవ్, సిరాజ్, షమీ డకౌట్ అయ్యారు. కెఎల్ రాహుల్-9; హార్దిక్ పాండ్యా-1; కులదీప్ యాదవ్-4 రన్స్ చేశారు.
ఆ తర్వాత ఆసీస్ ఓపెనర్లు రెండో ఓవర్ నుంచి ఎదురుదాడి మొదలు పెట్టారు. మిచెల్ మార్ష్ 36 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్సర్లతో 66; ట్రావిస్ హెడ్ 30 బంతుల్లో 10 ఫోర్లతో 51 పరుగులతో అజేయంగా నిలిచారు.
మిచెల్ స్టార్క్ కు ‘ప్లేయర్ అఫ్ ద మ్యాచ్’ లభించింది.