Saturday, September 21, 2024
HomeసినిమాEndhe Endhe Song: 'ఏజెంట్' నుంచి మరో పాట విడుదల

Endhe Endhe Song: ‘ఏజెంట్’ నుంచి మరో పాట విడుదల

అఖిల్, సురేందర్ రెడ్డిల క్రేజీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘ఏజెంట్’ ఏప్రిల్ 28న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్‌ కు సిద్ధమవుతోంది. భారీ స్థాయిలో రూపొందుతున్న ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషన్స్‌ జోరుగా సాగుతున్నాయి. హిప్ హాప్ తమిళ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలోని ఫస్ట్  సింగిల్ మళ్ళీ మళ్ళీ పాట చార్ట్ బస్టర్ హిట్ అయ్యింది.

ఈ రోజు ఈ చిత్రం నుంచి ‘ఏందే ఏందే’ పాటని విడుదల చేశారు మేకర్స్. హిప్ హాప్ తమిళ ఈ పాటని లవ్లీ రొమాంటిక్ మెలోడీగా కంపోజ్ చేశారు. ఆస్కార్ విజేత చంద్రబోస్ ఈ పాటకు రాసిన సాహిత్యం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. తెలంగాణ నుడికారం ఉట్టిపడేట్లు రాసిన పదాలు అద్భుతమమైన సొగసుని తీసుకొచ్చాయి. సంజిత హెగ్డే, పద్మలత, హిప్ హాప్ కలసి ఈ పాటని చాలా శ్రావ్యంగా అలపించారు.

ఈ చిత్రానికి కథను వక్కంతం వంశీ అందించారు. ఎకె ఎంటర్‌ టైన్‌మెంట్స్, సురేందర్ 2 సినిమా పతాకాలపై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రానికి జాతీయ అవార్డు గ్రహీత నవీన్ నూలి ఎడిటర్‌ గా, అవినాష్ కొల్లా ఆర్ట్ డైరెక్టర్ గా పని చేస్తున్నారు.అజయ్ సుంకర, దీపా రెడ్డి సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ చిత్రం తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో  ఏప్రిల్ 28న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌ గా విడుదలౌతుంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్