వాక్సినేషన్ పై ప్రధానమంత్రి నరేంద్ర మోడికి లేఖ రాయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిర్ణయించారు. నేడు జరిగిన కేబినేట్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. త్వరగా వాక్సినేషన్ ను కేటాయించాలని జగన్ కోరనున్నారు. కరోనా నియంత్రణపై మంత్రివర్గం సుదీర్ఘంగా చర్చించింది. 45 ఏళ్ళు పైబడ్డ వారికి వాక్సినేషన్ విషయంలో ప్రాధ్యానత ఇవ్వాలని ఏపి ప్రభుత్వం భావిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా రెండు వారాల పాటు విధించిన కర్ఫ్యూ ను కట్టుదిట్టంగా అమలు చేయాలని, ఆర్టిసి బస్సులను కూడా మధ్యాహ్నం 12 గంటల వరకే నడపాలని, కళాశాలలు ఉదయం 11.30 గంటల వరకే నిర్వహించుకోవాలని కేబినెట్ అభిప్రాయపడింది.
ఆక్సిజన్ సమస్యను పరిష్కరించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, అవసరమైతే కర్ణాటక, ఒడిశా, తమిళనాడు నుంచి ఆక్సిజన్ తెప్పించేందుకు చర్యలు తీసుకోవాలని కేబినేట్ నిర్ణయించారు.