పశ్చిమ బెంగాల్లో జరుగుతున్నా హింసాత్మక సంఘటనలపై ప్రధానమంత్రి నరేద్రమోది సీరియస్ అయ్యారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపు తప్పడం పట్ల ప్రధాని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పరిస్థితులపై వెంటనే నివేదిక ఇవ్వాలని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ గవర్నర్ ను కోరింది.
బెంగాల్లో ఎన్నికల ఫలితాల అనంతరం జరిగిన హింసలో 12 మంది మృతి చెందారు. తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు హింసకు పాల్పడుతున్నారని, మారణకాండ సృష్టిస్తున్నారని బిజెపి నేతలు ఆరోపిస్తున్నారు. ఈ ఆరోపణలను తృణమూల్ కాంగ్రెస్ ఖండించింది. బిజెపి కార్యకర్తల దాడిలో తమ పార్టికి చెందిన ముగ్గురు కార్యకర్తలు చనిపోయారని, బిజెపి దాడులను తాము ఎదుర్కొంటున్నామని తృణమూల్ నేతలు చెబుతున్నారు.