దుబాయ్ లో జరుగుతోన్న బాడ్మింటన్ ఆసియా ఛాంపియన్ షిప్స్-2023, పురుషుల డబుల్స్ విభాగంలో భారత జోడీ సాత్విక్ సాయిరాజ్ రాంకీ రెడ్డి – చిరాగ్ శెట్టి ఫైనల్లో అడుగు పెట్టింది.
నేడు జరిగిన సెమీఫైనల్స్ లో తైవాన్ జోడీ లీ యంగ్-వాంగ్ చి లిన్ పై తొలి సెట్ ను 21-18తో గెల్చుకున్నారు. హోరాహోరీగా సాగిన రెండో సెట్ లో 14-13తో ఆధిక్యంలో నిలిచిన సమయంలో తైవాన్ ఆటగాళ్ళు రిటైర్మెంట్ తీసుకున్నారు. దీనితో భారత జోడీ టైటిల్ రేసులో నిలిచారు.
1965 తరువాత పురుషుల డబుల్స్ లో మన ఆటగాళ్ళు ఫైనల్స్ ఇప్పటివరకూ చేరలేకపోయారు. చరిత్ర సృష్టించేందుకు మరో అడుగుదూరంలో సాత్విక్-చిరాగ్ జోడీ ఉంది. రేపు జరగబోయే ఫైనల్స్ లో మలేషియా జోడీ ఒంగ్ ఈ సిన్- థియో ఈ తో వీరు తలపడనున్నారు.