Monday, June 17, 2024
HomeTrending Newsమే 3న భోగాపురం. అదానీ డేటా సెంటర్లకు శంఖుస్థాపన

మే 3న భోగాపురం. అదానీ డేటా సెంటర్లకు శంఖుస్థాపన

విశాఖపట్నంలో రూ.21,844 కోట్లతో నిర్మించునున్న అదానీ డేటా సెంటర్ కు మే 3వ తేదీన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. ఈ కార్యక్రమ ఏర్పాట్లను రాష్ట్ర ఐటి & పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్, మాజీ మంత్రి అవంతి శ్రీనివాసరావు, వైఎస్సార్సీపీ రీజినల్ కోర్డినేటర్ వై. వి.సుబ్బారెడ్డి, విశాఖ మున్సిపల్ కమిషనర్, సీపీ తదితరులు పరిశీలించారు.

ఈ సందర్భంగా మంత్రి గుడివాడ మాట్లాడుతూ అదేరోజు ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల స్వప్నం భోగాపురం విమానాశ్రయ నిర్మాణ పనులకు కూడా సిఎం జగన్ శంకుస్థాపన చేస్తారని వెల్లడించారు. ఈ రెండు ప్రాజెక్టుల నిర్మాణంతో సమీప భవిష్యత్తులో రాష్ట్ర ముఖచిత్రం మారబోతోందని విశ్వాసం వెలిబుచ్చారు. సెప్టెంబర్, 2025 నాటికి మొదటి డొమెస్టిక్ ఫ్లైట్ భోగాపురం విమానాశ్రయంలో దిగబోతోందని, తరువాత మూడు, నాలుగు నెలల్లో ఇంటర్నేషనల్ ఫ్లైట్ వస్తుందని వివరించారు. అదాని డేటా సెంటర్ ద్వారా 25 వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెప్పారు. విశాఖపట్నం, భోగాపురం మధ్య ఆరు లైన్ల రహదారి నిర్మాణానికి త్వరలోనే శంకుస్థాపన జరగనుందన్నారు.

ఇప్పటికే శ్రీకాకుళం జిల్లా మూలపేట వద్ద 4,200 కోట్ల రూపాయలతో పోర్టు నిర్మాణ పనులను ప్రారంభించామని, రామాయపట్నం పోర్టు నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయని ఈ ఏడాది డిసెంబర్ లేదా వచ్చే ఏడాది జనవరి నాటికి మొదటి నౌక ఈ పోర్టుకు చేరుకుంటుందని అమర్నాథ్ వివరించారు. ఇవన్నీ అందుబాటులోకి వస్తే రాష్ట్ర పారిశ్రామిక ముఖచిత్రం మారుతుందని అన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్