Thursday, April 18, 2024
Homeస్పోర్ట్స్IPL: ఢిల్లీపై హైదరాబాద్ ప్రతీకారం

IPL: ఢిల్లీపై హైదరాబాద్ ప్రతీకారం

మొన్న సన్ రైజర్స్ హైదరాబాద్ ను వారి హోం గ్రౌండ్ లో  ఓడించిన ఢిల్లీ క్యాపిటల్స్ నేడు జరిగిన మ్యాచ్ లో తమ హోం గ్రౌండ్ లో అదే జట్టుపై ఓటమి పాలైంది. గత పరాజయానికి హైదాబాద్ బదులు తీర్చుకుంది. నేడు జరిగిన మ్యాచ్ లో 9పరుగుల తేడాతో హైదరాబాద్ విజయం సొంతం చేసుకుంది.

ఢిల్లీ అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో టాస్ గెలిచిన హైదరాబాద్ బ్యాటింగ్ ఎంచుకుంది. మయాంక్ అగర్వాల్ (5); రాహూల్ త్రిపాఠి (10); ఏడెన్ మార్ క్రమ్ (8); హ్యారీ బ్రూక్ (0) విఫలమయ్యారు. ఓ వైపు సహచారులంతా వెనుదిరిగుతున్నా ఓపెనర్ అభిషేక్ శర్మ ధాటిగా ఆడి 36 బంతుల్లో 12 ఫోర్లు, 1 సిక్సర్ తో 67 పరుగులు సాధించి ఐదో వికెట్ గా ఔటయ్యాడు. ఈ దశలో హెన్రిచ్ క్లాసేన్ – అబ్దుల్ సమద్ 53 రన్స్ భాగస్వామ్యం నెలకొల్పారు. సమద్ -28 (21 బంతుల్లో 1 ఫోర్; 2 సిక్సర్లు) రన్స్ చేసి ఔట్ కాగా, క్లాసేన్ 27 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సర్లతో 53;  అకీల్ హోసేన్ 10 బంతుల్లో 1ఫోర్ 1 సిక్సర్ తో 16 పరుగులతో అజేయంగా నిలిచారు. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 197 పరుగులు చేసింది. ఢిల్లీ బౌలర్లలో మిచెల్ మార్ష్ 4; ఇషాంత్ శర్మ, అక్షర్ పటేల్ చెరో వికెట్ సాధించారు.

పరుగుల ఖాతా తెరవకముందే ఢిల్లీ కెప్టెన్ వార్నర్ ఔటయ్యాడు. మిచెల్ మార్ష్- ఫిల్ సాల్ట్ లు రెండో వికెట్ కు 112 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు. సాల్ట్ 35 బంతుల్లో 9 ఫోర్లతో 59; మార్ష్ 39 బంతుల్లో 1 ఫోర్, 6 సిక్సర్లతో 63   పరుగులు చేసి ఔటయ్యారు. మనీష్ పాండే(1), ప్రియమ్ గార్గ్ (12),  సర్ఫరాజ్ ఖాన్ (9) విఫలం కాగా, చివర్లో అక్షర్ పటేల్ (29) – రిపల్ పటేల్ (11) లు వేగంగా ఆడినా ప్రయోజనం లేకుండా పోయింది, 6 వికెట్లు కోల్పోయి 188 పరుగులు చేసింది. హైదరాబాద్  బౌలర్లలో మయంక్ మార్కండే 2; భువి, అభిషేక్ శర్మ, నటరాజన్, అకీల్ హోసేన్ తలా ఒక వికెట్ సాధించారు.

ఢిల్లీ ఆటగాడు, నాలుగు వికేట్లతోపాటు 63 పరుగులు చేసి ఆల్రౌండ్ ప్రతిభ చూపిన మిచెల్ మార్ష్ కు ‘ప్లేయర్ అఫ్ ద మ్యాచ్’ దక్కింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్