ఇన్నింగ్స్ చివరి బంతికి సందీప్ శర్మ వేసిన నోబాల్ మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసింది. సన్ రైజర్స్ హైదరాబాద్ నాలుగు వికెట్ల తేడాతో రాజస్థాన్ పై విజయం సాధించింది. చివరి బంతికి ఐదు పరుగులు కావలసిన దశలో సందీప్ శర్మ నోబాల్ వేశాడు. అదనంగా వచ్చిన బంతిని అబ్దుల్ సమద్ స్టాండ్ లోకి మలిచి హైదరాబాద్ కు అపూర్వ విజయం అందించాడు
జైపూర్ లోని సవాయి మాన్ సింగ్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో రాజస్థాన్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. పెనర్ యశస్వి జైశ్వాల్ 35 పరుగులు చేసి జట్టు స్కోర్ 54 వద్ద ఔటయ్యాడు. ఆ తర్వాత కెప్టెన్ సంజు శామ్సన్ – జోస్ బట్లర్ లు హైదరాబాద్ బౌలర్లను ఆటాడుకున్నారు రెండో వికెట్ కు 148 పరుగుల రికార్డు భాగస్వామం నెలకొల్పారు 59 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్సర్లతో 95 పరుగులు చేసి 19 ఓవర్లో ఔటయ్యాడు. శామ్సన్ 38 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్సర్లతో 66 పరుగులు చేశాడు. 20 ఓవర్లలో రెండు వికెట్లు నష్టానికి 214 పరుగులు చేసింది. హైదరాబాద్ బౌలర్ల లో భువనేశ్వర్ మార్కో జాన్సెన్ చెరో వికెట్ పడగొట్టారు.
భారీ లక్ష్యసాధనలో బరిలోకి దిగిన హైదరాబాద్ తొలి వికెట్ కు 51 పరుగులు చేసింది. అన్మోల్ ప్రీత్ 33 పరుగులు చేసి వెనుదిరిగాడు. రెండో వికెట్ కు రాహుల్ త్రిపాఠి – అభిషేక్ శర్మలు 65 పరుగులు జోడించారు. అభిషేక్ శర్మ 55, రాహుల్ త్రిపాఠి 47, హెన్రిచ్ క్లాసేన్ 26 పరుగులు చేయగా కెప్టెన్ ఏడెన్ మార్ క్రమ్ (6) విఫలమయ్యాడు. రాజస్థాన్ బౌలర్ యజువేంద్ర చాహల్ 18 ఓవర్లలో కేవలం మూడు పరుగులు ఇచ్చి రెండు వికెట్లు పడగొట్టాడు దీనితో రాజస్థాన్ విజయం ఖాయమని అందరూ భావించారు. కానీ గ్లెన్ ఫిలిఫ్స్ 19వ ఓవర్లో మూడు వరుస సిక్సర్లు, ఒక ఫోర్ కొట్టాడు. మొత్తం 7 బంతుల్లో 25 పరుగులు చేసి 19వ ఓవర్లో ఔట్ కావడంతో విజయంపై హైదరాబాద్ ఆశలు వదులుకుంది. చివరి ఓవర్లో అబ్దుల్ సమద్ 2,6,2 పరుగులు చేశాడు. నాలుగో బంతికి సింగల్, ఐదో బంతికి మార్కో జెన్సన్ సింగిల్ తీసి స్ట్రైకింగ్ సమద్ కు ఇచ్చారు. చివరి బంతి నోబాల్, ఆ తర్వాతి బంతికి సిక్సర్ తో హైదరాబాద్ విజయం సొంతం చేసుకుంది.
రాజస్థాన్ బౌలర్లలో చాహల్ 4 వికెట్లు కుల్దీప్ యాదవ్, రవిచంద్రన్ అశ్విన్ చెరో వికెట్ సాధించారు. గ్లెన్ ఫిలిప్స్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది