Friday, October 18, 2024
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంకాయగూరల్లో విషం

కాయగూరల్లో విషం

Pesticide Contaminated Fruits and Vegetables

మనకు వంకాయల్లో పుచ్చులుండకూడదు. బెండ, దొండ నిగనిగలాడాలి. యాపిల్స్ మెరవాలి. అరటి పళ్ళపై మచ్చలుండకూడదు… ఆకుకూరలు తాజాగా నవనవలాడాలి. ఇలా ఎన్నో అభిప్రాయాలు.

ఎంత దూరమైనా వెళ్లి నిగనిగలాడే కూరలు, పండ్లు తెచ్చుకుంటాం. అంతకు ముందేమో గానీ కరోనా వచ్చాక కాయగూరలు పళ్ళు తాజాగా తినాలనే స్పృహ అంతకంతకూ పెరిగింది. ఇంటికి తెచ్చాక శుభ్రంగా కడగడమూ పెరిగింది. మంచిదే కానీ కూరగాయలు పళ్ళు నిలవుండటానికి వాటిపై రసాయనాల వాడకం ఎక్కువైంది. ఆ వీడియోలు వైరల్ కావడంతో అందరిలో ఆందోళన మొదలైంది.

కూరగాయలు తిని లేనిపోని రోగాలు తెచ్చుకుంటున్నామేమో అని భయపడుతున్నారు.

‘Worrying’ pesticide levels in Vegetables and Fruits:

Pesticide Contaminated Fruits and Vegetables : 

పంట దిగుబడి ఎక్కువ రావడానికి, పక్షులు, జంతువులు పాడుచేయకుండా మందులు, రసాయనాలు చల్లడం మనకు తెలిసిందే. అక్కడితో ఆగకుండా కోసిన కూరలు, పళ్ళు నిలవ చేయడానికి మళ్ళీ రసాయనాలు వాడుతున్నారు. వీటిని సరిగా శుభ్రం చేయకుండా వాడితే తల తిరుగుడు, కడుపునొప్పి, విరేచనాలు, ఆందోళన, శ్వాసకోశ సమస్యలు, దీర్ఘ కాలంలో మరపు , చర్మ సమస్యలు వచ్చే అవకాశం ఉంది.

ముఖ్యంగా పిల్లలు, పాలిచ్చే తల్లులు మరింత జాగ్రత్తగా ఉండాలని నిపుణుల సూచన. మరోపక్క ఆర్గానిక్ ఉత్పత్తుల పేరిటా కొంత మోసం జరుగుతోంది. సులభంగా కూరగాయలపై రసాయనాలు తొలగించడానికి అందుబాటులో ఉన్న కొన్ని చిట్కాలు .. మంచి పసుపు ఒక స్పూను నీళ్లలో కలిపి అందులో కూరగాయలు, పండ్లు కడగాలి

నీటిలో కొంచెం నిమ్మరసం, బేకింగ్ సోడా కలిపిన మిశ్రమం రసాయనాల అవశేషాలు చక్కగా తొలగిస్తుంది

యాపిల్స్, పియర్స్ వంటి పండ్లను బ్రష్ తో రుద్ది కడగాలి

అనుమానం ఉంటే పండ్లు తొక్క తీసి వాడుకోవాలి

ఉప్పు కలిపిన నీటిలో కూరగాయలు, పండ్లు వేసి కాసేపయ్యాక మాములు నీటితో కడగాలి.

ఒక వంతు వైట్ వెనిగర్, తొమ్మిది వంతుల నీరు కలిపి ఆ మిశ్రమంతో కడిగినా రసాయనాలు తొలగిపోతాయి

కూరగాయలు, పండ్లు ముక్కలు చేసి వేడినీటిలో వేసి, తీసి చల్లటి నీటిలో ముంచినా చక్కగా శుభ్రపడతాయి

మెరిసేదంతా బంగారం కానట్లే నిగనిగలాడే కాయగూరలు, పళ్ళు సురక్షితం కాకపోవచ్చు. స్వీయ జాగ్రత్తే శ్రీరామ రక్ష.

-కె. శోభ

Also Read: ఈ బామ్మ చాలా ఫిట్

Also Read:చైనా యువత పడక ఉద్యమం

RELATED ARTICLES

Most Popular

న్యూస్