Friday, October 18, 2024
Homeస్పోర్ట్స్IPL: షైనింగ్ లెస్ సన్ రైజర్స్ - గుజరాత్ చేతిలో ఓటమి

IPL: షైనింగ్ లెస్ సన్ రైజర్స్ – గుజరాత్ చేతిలో ఓటమి

ఐపీఎల్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ మరోసారి పేలవమైన ఆటతీరుతో నిరాశ పరిచింది. గుజరాత్ టైటాన్స్ చేతిలో 34 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. గుజరాత్  ఇచ్చిన 189 పరుగుల లక్ష్యం కోసం బరిలోకి దిగిన హైదరాబాద్ 20 ఓవర్లలో9 వికెట్లు కోల్పోయి 154 పరుగులే చేసింది. 29 పరుగులకే నలుగురు టాపార్డర్ ఆటగాళ్ళు…. అన్మోల్ ప్రీత్ సింగ్-5; అభిషేక్ శర్మ-5; ఏడెన్ మార్ క్రమ్-10; రాహుల్ త్రిపాఠి-1… పెవిలియన్ చేరారు. మిడిల్ ఆర్డర్ లో వచ్చిన హెన్రిచ్ క్లాసేన్- 64 (44  బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లు) మినహా సన్వీర్ సింగ్-7, అబ్దుల్ సమద్-4; మార్కో జాన్సెన్-3 కూడా విఫలమయ్యారు. చివర్లో భువి-27; మయాంక్ మార్కేండే-18 పరుగులతో రాణించారు. గుజరాత్ బౌలర్లలో మహమ్మద్ షమీ, మోహిత్ శర్మ చెరో నాలుగు; యష్ దయాళ్ ఒక వికెట్ పడగొట్టారు.

అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో హైదరాబాద్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. పరుగుల ఖాతా తెరవక ముందు గుజరాత్ ఓపెనర్ వృద్ధిమాన్ సాహా డకౌట్ గా వెనుదిరిగాడు. రెండో వికెట్ కు శుభ్ మన్ గిల్- సాయి సుదర్శన్ లు 147 పరుగులు జోడించారు. 36 బంతుల్లో 6 ఫోర్లు. 1 సిక్సర్ తో 47 పరుగులు చేసి సుదర్శన్ ఔటయ్యాడు.  ఆ తర్వాత వచ్చిన వారు వరుసగా వెనుదిరిగుతున్నా గిల్ క్రీజులోనే ఉంది 58 బంతుల్లో 13 ఫోర్లు, 1 సిక్సర్ తో 101 పరుగులు చేసి ఆరో వికెట్ గా వెనుదిరిగాడు. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 188 పరుగులు చేసింది. హైదరాబాద్ బౌలర్లలో భువీ కి ఐదు వికెట్లు దక్కాయి. మార్కో జాన్సెన్, ఫజల్ హక్ ఫారూఖి, నటరాజన్, తలా ఒక వికెట్ సాధించారు.

శుభ్ మన్ గిల్ కే ప్లేయర్ అఫ్ ద మ్యాచ్ దక్కింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్