Saturday, November 23, 2024
HomeTrending NewsManipur: మణిపూర్‌లో కొత్త వివాదం

Manipur: మణిపూర్‌లో కొత్త వివాదం

మణిపూర్‌లో రెండు వర్గాల మధ్య చెలరేగిన ఘర్షణలు తగ్గుముఖం పడుతున్న వేళ మరో రాజకీయ వివాదం తెరపైకి వచ్చింది. కుకి గిరిజనులు అధిక సంఖ్యలో ఉన్న ప్రాంతాన్ని ప్రత్యేక పాలన కిందకు తీసుకురావాలని, దీనికి రాష్ట్ర హోదా కల్పించాలని, ‘ప్రత్యేక పాలనా ప్రాంతం’గా ప్రకటించాలన్న డిమాండ్‌ ఊపందుకున్నది. రాష్ట్ర సీఎం బిరేన్‌సింగ్‌ ఈ డిమాండ్‌ను తిరస్కరించిన కొద్దిగంటల్లోనే, 10 మంది ఎమ్మెల్యేలు గిరిజనులకు ప్రత్యేక రాష్ట్రం ప్రకటించాలని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాకు లేఖ రాశారు. లేఖ రాసిన ఎమ్మెల్యేల్లో ఐదుగురు బీజేపీ వారున్నారు.

రాష్ట్ర జనాభాలో 53 శాతంగా ఉన్న మైతీ తెగ ప్రజలకు ఎస్టీ హోదా ఇవ్వొద్దంటూ ఈ నెల 3న ఆల్‌ ట్రైబల్‌ స్టూటెండ్స్‌ యూనియన్‌ (ATSUM) చేపట్టిన నిరసన హింసాత్మకంగా మారింది. అల్లర్లతో రాష్ట్రం అట్టుడికింది. హింసలో గ్రామాలకు గ్రామాలు తగలబడిపోయాయి. మైతీలు, గిరిజనుకు మధ్య పరస్సర దాడులు పెరడంతో రాష్ట్రం నుంచి చాలా మంది వలసబాటపట్టారు. మణిపూర్‌కు చెందిన 5800 మందికిపైగా మిజోరంలోని వివిధ జిల్లాల్లో ఆశ్రయం పొందుతున్నారని అధికారులు తెలిపారు. వారంతా చిన్ (Chin)‌, కుకి (Kuki), మిజో (Mizo) తెగలకు చెందివారే ఉన్నారని చెప్పారు. వీరంతా మిజోరంలోని ఆరు జిల్లాల్లో ఏర్పాటుచేసిన తాత్కాలిక శిబిరాల్లో తల దాటుకుంటున్నారని వెల్లడించారు.

ఇలా ఐజ్వాల్‌ జిల్లాలో అత్యధికంగా 2021 మంది ఆశ్రయం పొందుతున్నారని, తర్వాత 1847 మందితో కొలాసిబ్‌, 1790 మందితో సైతువాల్‌ జిల్లాలు ఉన్నాయి. కాగా, గిరిజనుల కోసం ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు ట్రైబల్‌ ఎమ్మెల్యేలు పట్టుబట్టాలని మిజోరం ఎంపీ సీ లార్లోసంగా సూచించారు. మణిపూర్‌ ప్రభుత్వం కింది గిరిజన ప్రజలు ఎక్కువకాలం మనుగడ సాగించలేరని ఆరోపించారు.

ఇంఫాల్‌ జిల్లాల్లో అడపా దడపా మిలిటెంట్‌ గ్రూపులకు, భద్రతా దళాలకు కాల్పులు కొనసాగుతున్నాయి. అయితే ఈ హింసాత్మక పరిస్థితులకు అంకురార్పరణ మాత్రం కొన్ని నెలల నుంచి కొనసాగింది. మైతీ తెగలోకి చేరిన సంఘ్‌ పరివార్‌ శక్తులు ప్రస్తుత అల్లర్లకు ఆజ్యం పోసినట్టు తెలుస్తున్నది. ప్రభుత్వ వైఫల్యం, అధికార బీజేపీ విభజన వాదం, ఓట్ల రాజకీయాలు..అన్నీ కలిసి ప్రశాంతమైన ఈశాన్య రాష్ట్రంలో విద్వేషాగ్ని రగిలించాయి. ఇదే అదనుగా కేంద్రంలోని బీజేపీ సర్కారు రాష్ట్రంపై 355 అధికరణ ప్రయోగించి తన నియంత్రణలోనికి తెచ్చుకుంది. మొత్తం ఏడు కారణాలు మణిపూర్‌లో మంటలు రేపాయి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్