Thursday, March 12, 2026
Homeస్పోర్ట్స్Malaysia Masters:  ప్రీ క్వార్టర్స్ కు సింధు, ప్రణయ్, కిడాంబి

Malaysia Masters:  ప్రీ క్వార్టర్స్ కు సింధు, ప్రణయ్, కిడాంబి

కౌలాలంపూర్ లో జరుగుతోన్న మలేషియా మాస్టర్స్-2023 లో భారత షట్లర్లు పివి సింధు, కిడంబి శ్రీకాంత్, హెచ్ ఎస్ ప్రణయ్ లు తొలి రౌండ్ లో విజయం సాధించి ప్రీ క్వార్టర్ ఫైనల్స్ కు చేరుకున్నారు. కాగా, నిన్న తొలి రౌండ్ లో విజయం సాధించిన మాళవిక బన్సోద్, ఆకర్షి కాశ్యప్ , ఆశ్మిత చలీహా నేడు ఓటమి పాలయ్యారు.

మహిళల సింగిల్స్ లో పివి సింధు 21-13; 17-21; 21-18 తేడాతో డెన్మార్క్ క్రీడాకారిణి లైన్ క్రిస్టొఫియర్సన్ పై గెలుపొందింది.

పురుషుల సింగిల్స్ లో కిడంబి శ్రీకాంత్ 21-13; 21-16తో ఫ్రెంచ్ ఆటగాడు తోమా జూనియర్ పెపోవ్ పై;  హెచ్ ఎస్ ప్రణయ్ 16-21; 21-14; 21-13తో చైనీస్ తైపీ ఆటగాడు చొ టీన్ చెన్ పై; లక్ష్య సేన్ 21-10; 16-21; 21-9 తేడాతో సింగపూర్ ప్లేయర్ లొహ్ కీన్ యూ పై  విజయం సాధించారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular