కౌలాలంపూర్ లో జరుగుతోన్న మలేషియా మాస్టర్స్-2023 లో భారత షట్లర్లు పివి సింధు, కిడాంబి శ్రీకాంత్, హెచ్ ఎస్ ప్రణయ్ లు ప్రీ క్వార్టర్ లో తమ ప్రత్యర్థులపై విజయం సాధించి క్వార్టర్స్ కు చేరుకున్నారు.
నేడు జరిగిన మ్యాచ్ ల్లో…
- మహిళల సింగిల్స్ లో పివి సింధు 21-16; 21-11తో జపాన్ ప్లేయర్ ఆయా ఒహోరి పై విజయం సాధించింది.
పురుషుల సింగిల్స్ లో…
- హెచ్ ఎస్ ప్రణయ్ 13-21; 21-16; 21-11 తో చైనా ఆటగాడు లీ షీ ఫెంగ్ పై
- కిడాంబి శ్రీకాంత్ 21-19;21-19 తో మలేషియా ప్లేయర్ కున్లావుట్ పై గెలుపొందారు.
కాగా, మరో ఆటగాడు లక్ష్య సేన్ 14-21;19-21తో హాంగ్ కాంగ్ కు చెందిన లాంగ్ అంగుస్ చేతిలో ఓటమి పాలయ్యాడు.